బీఆర్ఎస్ నేతల గృహనిర్బంధం
సరూర్ నగర్లో యువ సంగ్రామ సదస్సు నేపథ్యంలో పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy)ని హైదరాబాద్లోని ఆమె నివాసంలో గృహనిర్బంధం చేశారు. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar)ను కూడా ఆయన ఇంట్లో నిర్బంధించారు. యువసంగ్రామ సదస్సుకు హైకోర్టు (High Court) అనుమతి ఉన్నప్పటికీ గృహనిర్బంధం చేయడంపై బీఆర్ఎస్ నేతలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకున్నప్పటికీ నిరుద్యోగ యువత తరపున తమ గళం వినిపిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్బంధాలు మానుకొని, ఇచ్చిన హామీల మేరకు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ (KCR) నోటిఫికేషన్ వేసిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి తామే ఆ ఉద్యోగాలు ఇచ్చినట్టు ప్రచారం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.








