గుంటూరు ఘటనపై .. హోం మంత్రి అనిత సీరియస్
గుంటూరులో మహిళను వివస్త్రను చేసి దాడికి పాల్పడ్డ ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై జిల్లా ఎస్పీ (District SP)తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. విచారణలో నిర్లక్ష్యం వహించిన పోలీసుల (Police)పైనా చర్యలకు హోం మంత్రి ఆదేశించారు. ఘటన జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడంలో సీఐ ( CI) ఎందుకు తాత్సారం చేశారని ప్రశ్నించారు. ఆడబిడ్డల జోలికి వస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించారాదని స్పష్టం చేశారు. నేరస్థుల్ని నేరస్థులుగానే చూడాలి తప్ప పార్టీల పరంగా చూడరాదని తేల్చి చెప్పారు. పార్టీల ముసుగులో నేరాలకు ప్పాలడేవారిపై కఠినంగా ఉండాలని హోం మంత్రి ఆదేశించారు.








