సమాజంలో ఇలాంటి వాటికి తావులేదు.. నిందితులపై కఠిన చర్యలు: సీఎం చంద్రబాబు ఆదేశం
గుంటూరు ఘటనను సీరియస్గా తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ఆదేశించారు. మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేశారు. సమాజంలో ఏ ఒక్క మహిళకు అవమానం జరిగినా, అది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. సమాజంలో ఇలాంటి వాటికి తావులేదని తెలిపారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, దోషులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఈ దారుణానికి సంబంధించి ఇప్పటికే క్రిమినల్ కేసు నమోదైందని, నిందితుడిని పోలీసులు(police) అరెస్ట్ చేశారన్నారు. ఈ ఉదంతంలో ప్రమేయం ఉన్న సదరు పార్టీ కార్యకర్తలను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ (suspended) చేస్తున్నామన్నారు. రాజకీయ అండదండలు ఉన్నా సరే చట్టం వదిలిపెట్టలేదని సీఎం స్పష్టం చేశారు. తప్పు చేసిన వారి విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. చట్టం ఎవరికీ లొంగదు, పక్షపాతం చూపదన్నారు. రాజకీయ పలుకుబడి లేదా పార్టీతో అనుబంధం ఉందనే కారణంతో ఏ ఒక్కరికీ రక్షణ లభించదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి మహిళ (woman)కు తమ గౌరవానికి, భద్రతకు ఎల్లప్పుడూ రక్షణ ఉంటుందనే నమ్మకాన్ని కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.








