అమెరికాలో ఘనంగా నవకుండాత్మక శత చండీ సహిత రుద్ర యాగం
అమెరికాలోని మిస్సోరీలో ఉన్న ది హిందూ టెంపుల్ ఆఫ్ సెయింట్ లూయిస్ లో నవకుండాత్మక శత చండీ సహిత రుద్ర యాగం (Sata Chandi Sahita Rudra Yagam) ఘనంగా కొనసాగింది. గోపూజతో మూడో రోజు కార్యక్రమాలు మొదలయ్యాయి. ఉదయం మహన్యాస పారాయణం, రుద్ర, అరుణ హోమాలు నిర్వహించారు. సాయంత్రం చండీ, రాజశ్యామల హోమాలు నిర్వహించారు. పూజల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. పూజల్లో ప్రవాసాంధ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు గంగవరపు రజనీకాంత్ (Gangavarapu Rajinikanth), ఉపాధ్యక్షుడు సాక్షి విజయ్ (Sakshi Vijay), కార్యదర్శి జంగా కిషోర్ (Janga Kishore) తదితరులు పాల్గొన్నారు.








