ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు : మంత్రి సత్యకుమార్
కొవిడ్ (Covid) పై నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ (Satyakumar Yadav) తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా రాయనపాడులో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసుల పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ కొవిడ్ కేసులు వస్తున్నాయన్నారు. కేరళ (Kerala)లో 115, కర్ణాటక (Karnataka)లో 64, తమిళనాడు (Tamil Nadu)లో 39 కేసులు బయటపడ్డాయని, రాష్ట్రంలో 13 మాత్రమే నమోదయ్యాయని తెలిపారు. నమÖనాలను సేకరించి పుణెలోని ల్యాబ్‌కు పంపించామని తెలిపారు. శానిటైజర్లు, కొవిడ్ సామగ్రి అందుబాటులో ఉంచామని, ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులు పెట్టామన్నారు. ప్రస్తుతం నమోదవుతున్నవి ప్రమాదకరమైన వేరియంట్ కాదని తెలిపారు.








