సోనమ్ వాంగ్ చుక్ దీక్ష భగ్నం… ఆస్పత్రికి తరలింపు
జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్చుక్ను ఢిల్లీ పోలీసులు ఆస్పత్రికి తరలించారు. వాంగ్చుక్కు సరైన వైద్యసాయం అందించాలన్న ఢిల్లీ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పోలీసులు బలవంతంగా ఆయనను నిరాహార దీక్ష చేస్తున్న శిబిరం వద్ద నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ సమయంలో నిరసనకారులు పోలీసులను అడ్డుకోవటంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ప్రవేశ పరీక్షల నిర్వహణలో లోపాలకు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని గత నెలాఖరులో సోమన్ వాంగ్ చుక్ నిరాహార దీక్షకు దిగారు. దీక్షతో ఆయన ఆరోగ్యం క్షీణించిపోయింది. దీంతో ఆయన్ను సఫ్దర్ జంగ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే వుంది.
అయితే.. తన అనుమతి లేకుండా తన భర్తకు చికిత్స అందించవద్దని వాంగ్ చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో డిమాండ్ చేశారు. ఆయన సఫ్దర్ జంగ్ ఆస్పత్రిలో వున్నారని, తన అనుమతి లేకుండా చికిత్స ప్రారంభం చేయవద్దని డిమాండ్ చేశారు. ఆయనకు ఏమైనా జరిగితే ప్రతి ఒక్కర్ని బాధ్యుల్ని చేస్తానని హెచ్చరించారు.








