లైంగిక వేధింపుల కేసు .. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్
లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన ఉదయ్ కృష్ణారెడ్డి (Uday Krishna Reddy)కి 67 రోజుల తర్వాత ఉప్పరపల్లి కోర్టు (Upparpalli Court) షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల చొప్పున రెండు పూచీ కత్తులు సమర్పించాలని, ప్రతి ఆదివారం పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాలని న్యాయమూర్తి బెయిల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (Sardar Vallabhbhai Patel National Police Academy)లో శిక్షణ పొందుతున్న తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపులు, బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో అత్తాపూర్ పోలీసులు (Attapur Police) ఆయనపై కేసు నమోదు చేశారు. జూలై 29న నల్గొండ జిల్లా దామరచర్ల సమీపంలో పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని అరెస్టు చేసి, ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచగా జ్యూడీషియల్ రిమాండ్ విధించారు. అప్పటి నుంచి ఆయన చంచల్‌గూడ జైలు (Chanchalguda Jail)లో ఉన్నారు.








