బీసీలపై గొడ్డలి పార్టీకి ఎందుకు అంత కక్ష? : కేంద్రమంత్రి రామ్మోహన్
బీసీలకు రిజర్వేషన్లు పెరిగితే వైసీపీ నేతలకు బాధ ఎందుకుని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) మండిపడ్డారు. ఢిల్లీలో మంత్రులు అచ్చెన్నాయుడు(Atchannaidu), పార్థసారథి (Parthasarathi), సత్యప్రసాద్ (Satyaprasad)తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్లు 50 శాతం కంటే పెంచుకునే హక్కు ఉందని, ఉన్న వెసులుబాటును ఎందుకు వదులుకోవాలని ప్రశ్నించారు. బీసీలపై గొడ్డలి పార్టీకి ఎందుకు అంత కక్ష అని ఆక్షేపించారు. బీసీ రిజర్వేషన్ల (BC Reservations)కోసం గతంలో వైసీపీ (YCP) ఎందుకు న్యాయ పోరాటం చేయలేదని ప్రశ్నించారు. బీసీలపై మీకు ఉన్నది వ్యక్తి గత కక్షా, రాజకీయ కక్షా? మేం మంచిపని చేస్తున్నప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారు అని మండిపడ్డారు.








