ప్రధాని మోదీతో కలిసి పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నా : సీఎం చంద్రబాబు
ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) గత 25 ఏళ్లుగా నిరంతరాయంగా ప్రజాసేవలో కొనసాగుతున్న సందర్భంగా ఆయన నాయకత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ( Chandrababu) ప్రశంసించారు. ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ అద్భుతమైన మైలురాయి, సరైన సమయంలో సరైన స్థానం, సరైన నాయకుడు ఉండటం మన దేశ అదృష్టం. ఆయన దార్శనిక నాయకత్వంలో వికసిత్ భారత్ 2047 దిశగా భారత్ ఆత్మవిశ్వాసంతో పురోగమిస్తోంది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో డబుల్ ఇంజిన్ బుల్లెట్ రైలు సర్కార్ ప్రజల కోసం అభివృద్ధి, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, అవకాశాలను వేగవంతం చేస్తోంది. వికసిత్ భారత్ (Viksit Bharat)ను నిర్మించే, స్వర్ణాంధ్రప్రదేశ్ దార్శనికతను ముందుకు తీసుకెళ్తున్న ఈ ప్రయాణంలో ప్రధాని మోదీతో కలిసి పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నా. 25 సంవత్సరాల అంకితభావంతో కూడిన ప్రజా సేవను పూర్తి చేసుకున్న మోదీకి హృదయపూర్వక అభినందనలు. ఒక తరం దిశను నిర్దేశించే అవకాశం కొద్దిమంది నాయకులకే లభిస్తుంది. అలాంటి నాయకుల్లో మోదీ ఒకరు. ఆయన నాయకత్వం భారత్‌ను మరింత ఉన్నత శిఖరాలకు నడిపించాలని ఆశిస్తున్నాను అని పేర్కొన్నారు.








