ఇది క్షమించరాని నేరం : సీఎం రేవంత్ రెడ్డి
శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
శాసన సభలో చర్చలు జరిగాక నిర్ణయాలు జరుగుతాయి
బీజేపీ లేవనెత్తిన అంశాలపై కూలంకషంగా చర్చ జరిగాక సభ నిర్ణయం తీసుకుంటుంది
చర్చ జరగకుండా నిర్ణయం తీసుకోమనడం వారి చీకటి మిత్రులను కాపాడాలనే ప్రయత్నమే
ఇదే సభలో కాళేశ్వరం పై చర్చించి విచారణకు ఆదేశించాం
సభా సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది
సభలో ముఖ్యమంత్రి అయినా, శాసన సభ్యుడు అయిన స్పీకర్ కు సమానమే
అలాంటి స్పీకర్ మనసు గాయపడేలా బీఅరెస్ వ్యవహరించింది
ఇది వ్యక్తిగా గడ్డం ప్రసాద్ కుమార్ గారికి జరిగిన ఘటన కాదు
ఇవి కూడా చదవండి
స్పీకర్ పదవి అనేది ఒక అత్యున్నత స్థానం
సభాపతిని గౌరవించడం మన సంప్రదాయం
అలాంటి స్పీకర్ పై సభ్య సమాజం తల వంచుకునేలా కొంత మంది మాట్లాడారు
ఇది సభకు జరిగిన అవమానంగా భావించి సభ్యులు దీనిపై చర్చ పెట్టారు
ఇది సభ గౌరవానికి సంబంధించిన విషయం..
భవిష్యత్ తరాలు మన నుంచి నేర్చుకునేలా మన వ్యవహార శైలి ఉండాలి
ఇది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానం
తెలంగాణకు ఇది ఒక చీకటి రోజు
ఇంత అనుచిత భాషతో దూషించడం ఇది క్షమించరాని నేరం
సభాపతిని, ఆయన కుటుంబ సభ్యులను అవమానించేలా మాట్లాడారు
ఇది కేవలం దళితులకు జరిగిన అవమానం కాదు.. ఇది అందరికీ జరిగిన అవమానం
తెలంగాణ వస్తే దళితుడిని సీఎం చేస్తానని నమ్మించి… దళితులకు మూడెకరాలు ఇస్తానని నమ్మించి
దళిత బంధు ఇస్తామని నమ్మించి దళిత ఉప ముఖ్యమంత్రిని భర్తరఫ్ చేశారు..
నేరెళ్లలో ఇసుక లారీలను అడ్డుకున్న దళితులను లారీలతో తొక్కించి చంపారు
ఒక దళితుడిని కాంగ్రెస్ సీఎల్పీ నాయకుడిని చేస్తే పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించి ప్రతిపక్ష హోదా నుంచి తొలగించారు
బీఆరెస్ ది దళిత వ్యతిరేక ఆలోచన, దళిత వ్యతిరేక వైఖరి
తల్లిని అవమానించేలా మాట్లాడటం ఇది మాకు అందరికీ జరిగిన అవమానంగా భావిస్తున్నాం
మనందరం ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది..
రాజకీయాలకు అతీతంగా మనం వ్యవహరించాలి
ఇలాంటి దుర్మార్గపు పోకడలను నియంత్రించాలి
ప్రభుత్వం సంయమనం పాటిస్తే ఆది చేతకానితనం అనుకుంటున్నారు
అదిరించి, బెదిరించి వ్యవస్థలను లొంగదీసుకుంటామంటే చూస్తూ ఊరుకోం
కేసీఆర్ క్షమాపణ చెప్పాలని సభా నాయకుడిగా డిమాండ్ చేస్తున్నా
క్షమాపణ చెప్పి ఆ సభ్యుడితో రాజీనామా చేయించాలని డిమాండ్ చేస్తున్నా
అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన సభ్యుడి సభ్యత్వం బర్తరఫ్ చేయాలని కోరుతున్నా.








