గవర్నర్ పదవికి కోవింద్ రాజీనామా
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా ఖరారైన నేపథ్యంలో బిహార్ గవర్నర్ పదవికి రామ్నాథ్ కోవింద్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించినట్లు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి బిహార్ గవర్నర్గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారని కూడా తెలిపింది.








