శాన్ ఫ్రాన్సిస్కో లో అత్యంత వైభవంగా దీపావళి వేడుకలు
భారతీయ అమెరికన్ సమాజం ఐక్యతతో శాన్ ఫ్రాన్సిస్కో లో అత్యంత వైభవంగా దీపావళి వేడుకలు జరుపుకున్నారు. దీపావళి వైభవం, దీపావళి ప్రాముఖ్యత యావత్ ప్రపంచానికి తెలిసొచ్చేలా, అత్యంత ఉత్సాహంగా, ఆనందంగా దీనిని జరుపుకున్నారు. నిర్వహించింది. ఈ కార్యక్రమానికి భారతీయ మరియు అమెరికన్ ప్రముఖులు, నగర అధికారులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని ఇండియాస్పోరా నిర్వహించగా, శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సుల్ జనరల్ సతీష్ శివన్ మరియు శాన్ ఫ్రాన్సిస్కో మేయర్ డేనియల్ లూరీ హాజరయ్యారు.ఇండియాస్పోరా వ్యవస్థాపకుడు ఎం.ఆర్. రంగస్వామి కూడా ఈ చారిత్రాత్మక వేడుకకు హాజరయ్యారు.
శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ ఈ కార్యక్రమ వివరాలను ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో పంచుకుంటూ, ఇది దీపావళి సంప్రదాయాలను నగర నడిబొడ్డుకు తీసుకువచ్చిన ఒక చారిత్రాత్మక సందర్భమని అభివర్ణించింది.’శాన్ ఫ్రాన్సిస్కో సిటీ హాల్లో ఒక చారిత్రాత్మక దీపావళి వేడుక!’ అని ఆ పోస్ట్‌లో పేర్కొంది.
ఈ కార్యక్రమం దీప ప్రజ్వలనతో ప్రారంభమైంది. అలాగే ఈ కార్యక్రమంలో భారతీయ సంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమం భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య ఉన్న శాశ్వత సాంస్కృతిక సంబంధాలను, అలాగే శాన్ ఫ్రాన్సిస్కోకు భారతీయ-అమెరికన్ సమాజం అందించిన ఉజ్వలమైన సేవలను ప్రముఖంగా చాటింది.







