Sajjala: భవిష్యత్తులో రిటర్న్ గిఫ్ట్ తప్పదు : సజ్జల
అధికారం ఉందని నేడు దాడులు చేస్తున్న వారికి భవిష్యత్తులో తమ పార్టీ అధికారంలోకి వచ్చాక రిటర్న్ గిఫ్ట్‌లు తప్పవని వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. మాజీ మంత్రి జోగి రమేష్‌ను(Jogi Ramesh) ఇబ్రహీంపట్నంలోని అతని నివాసంలో సజ్జల పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు (Chandrababu,), మంత్రి లోకేశ్‌లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. తిరుపతి లడ్డూ (Tirupati Laddu)లో కల్తీ నెయ్యి అంటూ వారు చేస్తున్న ఆరోపణలను ప్రజలు గమనిస్తున్నారు.కల్లీ జరిగిందా, లేదా అన్నది కేంద్ర సంస్థ ఆధ్వర్యంలో నిర్ధారించాలన్న ఉద్దేశంతో ఈ విషయాన్ని నేషనల్ మీడియా దష్టికి తీసుకెళ్లనున్నామని తెలిపారు. రాష్ట్రంలో నియంతత్వ పాలనను ప్రజలకు తెలియజేస్తామన్నారు. టీడీపీ శ్రేణుల దాడుల పట్ల పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులు జరుగుతున్న సంగతి పోలీసులకు తెలిసినా పట్టించుకోలేదు. ప్రభుత్వ పెద్దలు తమకు కావాల్సిన వారి సాయంతో వ్యవస్థలను నడుపుతున్నారు. వారి తప్పులను ప్రశ్నిస్తుంటే ఇలా దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});





