దేవుడితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో.. అనుభవిస్తున్నారు : లోకేశ్
కూటమి పాలనలో జేసీబీలు, దాడులు, హత్యలు, బూతులు లేవని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తెలిపారు. రెండేళ్ల కూటమి ప్రభుత్వ నమ్మకం, సంక్షేమంపై తిరుపతి (Tirupati) దామినీడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లోకేశ్ మాట్లాడుతూ వేంకటేశ్వరస్వామి జోలికి వెళ్లొద్దని నాటి సీఎంను హెచ్చరించామని, దేవుడితో పెట్టుకుంటే పరిస్థితి ఏంటో ఇవాళ అనుభవిస్తున్నారని వ్యాఖ్యానించారు. గొడ్డలి పార్టీ అరాచక పాలన చూశామన్నారు. టీడీపీ జెండా లేకుండా చేస్తామని నాడు వైసీపీ నేతలు ప్రగల్భాలు పలికారని, ఇవాళ ప్రజలే వైసీపీ జెండా పీకేసి టీమ్ 11 తీర్పు ఇచ్చారని సెటైర్ విసిరారు. వైసీపీ అరాచకాలు చూస్తూ ఊరుకోమని, రెడ్‌బుక్ దాని పని అది చేసుకుంటూపోతుందని స్పష్టం చేశారు. రప్పా రప్పా అంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాయలసీమ (Rayalaseema) అంటే ఎన్టీఆర్‌కు చాలా ప్రేమ అని తెలిపారు. నాడు కరువు వస్తే జోలె పట్టుకుని సీమ ప్రజలను ఆదుకున్నారని ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేశారు. రాయలసీమను రాయల్‌సీమగా మార్చామని మంత్రి చెప్పారు. రాయలసీమలో రత్నాలు పండేలా చేసిన వ్యక్తి సీబీఎన్ (CBN) అని కొనియాడారు. కలియుగం దైవం వేంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రజాప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంది అని అన్నారు.








