చంద్రబాబు అక్రమ అరెస్టుకు మూడేళ్లు .. 53 కొవ్వొత్తులు వెలిగించిన నారా లోకేష్
నిజం గెలిచింది… నీతి నిలిచింది
– చంద్రబాబు గారి అక్రమ అరెస్టుకు మూడేళ్లు
– కుట్రపూరితంగా 53 రోజుల నిర్బంధం
– నాటి చీకటి రోజుకు నిరసనగా
– 53 కొవ్వొత్తులు వెలిగించిన టిడిపి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్
సరిగ్గా మూడేళ్ల క్రితం ఇదే రోజు రాజకీయ దురుద్దేశంతో జగన్ కుట్రపూరితంగా పెట్టించిన తప్పుడు కేసులో చంద్రబాబు గారిని అర్ధరాత్రి వేళ అరెస్టు చేశారు. 53 రోజులు పాటు జైలులో నిర్బంధించారు. నాటి చీకటి రోజును నిరసిస్తూ.. ‘నిజం గెలిచింది’ నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా కొవ్వొత్తులు వెలిగించి సీఎం చంద్రబాబు గారికి ప్రజలు సంఘీభావం ప్రకటిస్తున్నారు.
ఉండవల్లి నివాసంలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ 53 కొవ్వొత్తులు వెలిగించారు. ఐదు దశాబ్దాల నిస్వార్ధ రాజకీయ విలువల శిఖరం నారా చంద్రబాబునాయుడు గారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది తెలుగు ప్రజల ఆశీస్సులతో కడిగిన ముత్యములా తప్పుడు కేసుల నుంచి బయటకు వచ్చారని లోకేష్ పేర్కొన్నారు. ప్రజా బలమే తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు గారికి శ్రీరామరక్ష అని ధీమా వ్యక్తం చేశారు.








