టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ ప్రజాదర్బార్
ప్రజల నుంచి వినతులు స్వీకరణ .. మంత్రి లోకేష్
మంగళగిరి: ఎన్ఆర్ఐ టీడీపీ సెంట్రల్ కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమం అనంతరం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, కార్యకర్తలు, నాయకులను కలుసుకున్నారు. ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పలకరించారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. ఆయా వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు.








