హిట్ వేటకు కార్తి సిద్ధం!
టాలీవుడ్లో సక్సెస్ఫుల్ క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీగా గుర్తింపు తెచ్చుకున్న హిట్(HIT) సిరీస్‌లో నాలుగో భాగానికి సన్నాహాలు ఊపందుకున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో కార్తి(Karthi) ప్రధాన పాత్రలో డైరెక్టర్ శైలేష్ కొలను(Sailesh kolanu) ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. గతంలోనే నాని ఈ ప్రాజెక్టులో కార్తి నటించనున్నట్లు సంకేతాలిచ్చారు. తాజాగా శైలేష్ కొలను కథను పూర్తి చేసినట్లు సమాచారం. త్వరలోనే నాని(Nani)కి కథ వినిపించి, ఆయన గ్రీన్ సిగ్నల్ తర్వాత కార్తితో డిస్కస్ చేయనున్నారట.
ప్రస్తుతం కళ్యాణ్ శంకర్(kalyan shankar) దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara entertainments) నిర్మిస్తున్న తెలుగు సినిమాతో కార్తి బిజీగా ఉన్నారు. ఈ సినిమాను 2027 సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు కార్తి చేతిలో పలు తమిళ సినిమాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నెక్ట్స్ ఇయర్ సమ్మర్ తర్వాత హిట్4ను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
ఇప్పటివరకు హిట్ ఫ్రాంచైజీలో వచ్చిన సినిమాలకు మించి భారీ బడ్జెట్‌తో నాలుగో భాగాన్ని నిర్మించేందుకు నాని సిద్ధమవుతున్నారట. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై రూపొందనున్న ఈ ప్రాజెక్టులో కార్తి క్యారెక్టర్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం సుజీత్(Sujeeth) దర్శకత్వంలో బ్లడీ రోమియో(Bloody romeo) సినిమాలో నటిస్తున్న నాని, నిర్మాతగానూ తన దూకుడు కొనసాగిస్తున్నారు. హిట్4కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం సినీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.







