మోటార్‌సైకిల్ డైరీస్.. టైటిల్‌తోనే ఆసక్తి పెంచుతున్న మూవీ!
జర్నీ అంటే కేవలం ఒక ఏరియా నుంచి మరో ఏరియాకు చేరుకోవడం మాత్రమే కాదు. మనసుకు దగ్గరైన అనుభూతులను, మధురమైన జ్ఞాపకాలను సొంతం చేసుకోవడం కూడా. ఇలాంటి ఎమోషనల్ కథాంశంతో ఆడియన్స్ ముందుకు రాబోతున్న కొత్త సినిమా మోటార్‌సైకిల్ డైరీస్. సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara entertainments), రిషబ్ శెట్టి ఫిల్మ్స్(Rishab shetty films) సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. రిషబ్ శెట్టి సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్‌ను తాజాగా అనౌన్స్ చేశారు.
శివా చిరంతానా(Siva chiranthana) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ(Suryadevara nagavamsi), ప్రజ్ఞతి రిషబ్ శెట్టి(Prathigna rishab shetty) నిర్మిస్తున్నారు. టైటిల్ అనౌన్స్మెంట్ తోనే ఈ సినిమా జర్నీ, లైఫ్ లోని ఎక్స్‌పీరియెన్స్, ఎమోషన్స్ చుట్టూ సాగనుందని ఆసక్తి నెలకొంది. ఈ రెండు నిర్మాణ సంస్థల కలయిక కూడా సినిమాపై అంచనాలను పెంచుతోంది.
ఇవి కూడా చదవండి
టెక్నికల్ గా కూడా ఈ సినిమా స్ట్రాంగ్ టీమ్‌ను కలిగి ఉంది. జీవీ ప్రకాష్ కుమార్(GV Prakash kumar) మ్యూజిక్ అందిస్తుండగా, భువన్ రెడ్డి(Bhuvan reddy) సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. నవీన్ నూలి(Naveen nooli) ఎడిటర్‌గా, ధరణి గంగేపుత్ర(Dharani Gangeputra) ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుండగా, నటీనటులు, ఇతర వివరాలను మేకర్స్ వెల్లడించనున్నారు.







