దుబాయ్‌లో ఘనంగా దీక్షా దివస్ వేడుకలు
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేపట్టిన చారిత్రక నిరాహార దీక్షను స్మరించుకుంటూ దుబాయ్‌లో దీక్షా దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల గారి ఆదేశాల మేరకు, ఆకుల సురేందర్ గారి ఆధ్వర్యంలో దుబాయ్ బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ బృందం మరియు బీఆర్ఎస్ కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ముందుగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి, అందరూ కలిసి ఆనందోత్సాహాల మధ్య దీక్షా దివస్‌ను జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో యజ్వేందర్, రాజేశ్వర్, శ్రీకాంత్, అభినవ్, రాజేష్, సతీష్ రెడ్డి, రవి, ఆనంద్, సంపత్, శ్రీనివాస్, సీఎస్ఆర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే దుబాయ్‌లోని పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు, ఎన్ఆర్ఐ సెల్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమ చరిత్రను, కేసీఆర్ గారి పోరాట స్ఫూర్తిని స్మరించుకుంటూ దీక్షా దివస్‌ను ఐకమత్యంతో, ఘనంగా నిర్వహించారు.







