పసిడి వర్ణంలో మెరిసిన నిహారిక
మోడ్రన్ ఫ్యాషన్‌తోనే కాదు, ట్రెడిషినల్ వేర్‌లోనూ అందంగా మెరవొచ్చని చాటి చెప్తోంది మెగా డాటర్ నిహారిక కొణిదెల(Niharika konidela). పసుపు, గులాబీ రంగుల కలయికతో రూపొందించిన ఓణీలో అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా కనిపిస్తోంది. అందమైన ఎంబ్రాయిడరీతో తీర్చిదిద్దిన జాకెట్, ఆకర్షణీయమైన ఆభరణాలు ఆమె రూపానికి మరింత వన్నె తెచ్చాయి. నుదుటన పాపిడి బిళ్ల, చెవులకు జుంకీలు, మెడలో సంప్రదాయ హారం, చేతులకు రంగురంగుల గాజులతో నిహారిక తనదైన శైలిలో ఆకట్టుకుంటోంది. ఓ ఫొటోలో ఓరచూపులతో మంత్రముగ్ధులను చేస్తుంటే, మరో ఫొటోలో చిరునవ్వులు చిందిస్తూ సహజ సౌందర్యానికి అద్దం పడుతోంది. హంగులు, ఆర్భాటాలకు దూరంగా లైట్ మేకప్, దానికి తగ్గ హెయిర్ స్టైల్ తో ఈ ఫొటోషూట్‌కు ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఈ ట్రెడిషనల్ లుక్‌లో నిహారిక అందాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.







