నాని – నితిన్.. స్నేహానికి మరో అందమైన జ్ఞాపకం!
టాలీవుడ్ లో నాని(Nani), నితిన్(Nithin) జర్నీ ఎన్నో ఇంట్రెస్టింగ్ మలుపులతో సాగింది. ఒకప్పుడు నితిన్ సినిమా కోసం క్లాప్ అసిస్టెంట్‌గా పనిచేసిన నాని.. ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగి, అదే నితిన్ హీరోగా నటిస్తున్న అలియాస్ రుక్మిణి(Alias rukmini) సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇద్దరి మధ్య కనిపించిన ఆత్మీయత ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. పాత రోజుల్ని గుర్తుచేసుకుంటూ ఒకరిపై మరొకరు ప్రశంసలు కురిపించడం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.
స్టేజ్ పైకి నాని, నితిన్ కలిసి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. నితిన్ గొడుగు పట్టుకోగా, నాని క్లాప్ బోర్డు చేతబట్టి రావడం వారి గత ప్రయాణానికి ప్రతీకగా నిలిచింది. సినిమాలో నితిన్ యాక్టింగ్ ఎంతో నేచురల్ గా, అద్భుతంగా ఉందని నాని ప్రశంసించారు. తనను కృష్ణ క్యారెక్టర్ కు సెలెక్ట్ చేసినందుకు నానికి నితిన్ థ్యాంక్స్ తెలిపారు. ఇద్దరి మధ్య కనిపించిన ఫ్రెండ్షిప్ ఈవెంట్ కు మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి.
ఇవి కూడా చదవండి
వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నితిన్ ఈ సినిమాతో సక్సెస్‌ను అందుకుంటాననే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. నిర్మాతగా సక్సెస్ లు అందుకుంటున్న నాని కూడా అలియాస్ రుక్మిణిపై ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు. డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నితిన్ కెరీర్‌కు కీలకంగా మారనుంది. ఇద్దరు యంగ్ హీరోలు పరస్పరం ప్రోత్సహించుకోవడం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.







