సంక్రాంతికి కాకాతో మెగాస్టార్ మాస్ రాంపేజ్!
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), డైరెక్టర్ బాబీ కొల్లి(Bobby kolli) కాంబినేషన్లో తెరకెక్కుతున్న కాకా(Kaaka) సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే రిలీజైన బర్త్‌డే గ్లింప్స్‌లో చిరంజీవి యంగ్ లుక్‌తో ఆకట్టుకోగా, తాజాగా ఆయన ఆటో జానీ(Auto johny) అవతారాన్ని పరిచయం చేస్తూ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సినిమా రిలీజ్‌పై నెలకొన్న సందిగ్ధతకు మెగాస్టార్ స్వయంగా తెరదించారు.
కాకా(Kaaka), విశ్వంభర(Vishwambhara) సినిమాలు ఒకేసారి రిలీజవుతాయంటూ వస్తున్న వార్తలను నమ్మొద్దని చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. వచ్చే సంక్రాంతికి తన నుంచి కాకా ఒక్కటే ఆడియన్స్ ముందుకు వస్తుందని అనౌన్స్ చేశారు. జనవరి 13, 2027న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఆటో జానీ క్యారెక్టర్ ను గుర్తు చేస్తూ ఫ్యాన్స్ లో పాత జ్ఞాపకాలను తాజాగా చేశారు.
ఇవి కూడా చదవండి
తాజా పోస్టర్లో బ్రౌన్ కలర్ దుస్తులు, గాగుల్స్, చేతికి బ్యాండ్, తుపాకీతో చిరంజీవి స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. యంగ్ లుక్‌లో ఆయన చూపించిన స్వాగ్ మెగా ఫ్యాన్స్ కు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తోంది. బాబీ చిరంజీవి బాడీ లాంగ్వేజ్‌ను మరోసారి అద్భుతంగా ఆవిష్కరించారు. తమన్(Thaman) మ్యూజిక్ ఈ యాక్షన్ ఎంటర్టైనర్కు మరింత బలాన్ని చేకూర్చనుంది. కేవీఎన్ ప్రొడక్షన్స్(KVN Productions) నిర్మిస్తున్న ఈ సినిమాలో అనస్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.







