యదార్థ సంఘటనలతో తెరకెక్కించిన ‘కురేన్ ఘాట్’.. ఘనంగా టీజర్ లాంచ్ ఈవెంట్
ఎస్ఎస్ మూవీ మేకర్స్, కేఎంసీ ప్రొడక్సన్స్ బ్యానర్ల మీద శ్రీమతి. సునీత శంకర్ సమర్పణలో దొబ్బల శంకర్ నిర్మాణంలో దుర్గం విజయ్ కుమార్ తెరకెక్కించిన చిత్రం ‘కురేన్ ఘాట్’. ఈ చిత్రంలో శ్రీమాన్, సోనాక్షి జంటగా.. తోట మహేష్, రాజా బాబు, సీతా మహాలక్ష్మీ, అనిల్, దివ్యయ, భాను, సంపత్, సూర్య, శ్రవణ్, ఆర్జీ, పద్మా, శ్రీను, వంశీ, శంకర్, రాజి రెడ్డి తదితరులు నటించారు. ఈ మూవీ టీజర్‌ని ఆదివారం నాడు లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో..
హీరో శ్రీమాన్ మాట్లాడుతూ .. ‘‘కురేన్ ఘాట్’ కోసం అందరం కలిసి కష్టపడ్డాం. కొత్త వాళ్లందరం కలిసి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్ని సినిమాని ఇక్కడకు వరకు తీసుకు వచ్చాం. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన నా టీంకి, ఆర్టిస్టులకు థాంక్స్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. డిసెంబర్లో మా మూవీని రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. మీడియా, ఆడియెన్స్ మా సినిమాని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
డైరెక్టర్ దుర్గం విజయ్ కుమార్ మాట్లాడుతూ .. ‘‘కురేన్ ఘాట్’ టీజర్ లాంచ్ ఈవెంట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించాం. కొత్త వాళ్లందరం కలిసి చేసిన ఈ చిత్రం బాగా వచ్చింది. క్రైమ్ జానర్లో తీసినా.. అన్ని రకాల కమర్షియల్ అంశాలతో మూవీని రూపొందించాం. ఈ సినిమాని అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
నిర్మాత దొబ్బల శంకర్ మాట్లాడుతూ .. ‘‘కురేన్ ఘాట్’ సినిమాకి సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. విజయ్ గారు సినిమాని గొప్పగా తెరకెక్కించారు. ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
డైలాగ్ రైటర్ శ్రీనివాస్ మాట్లాడుతూ .. ‘‘కురేన్ ఘాట్’ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ఈ చిత్రం చాలా బాగా వచ్చింది. ఈ మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ వేణు మాట్లాడుతూ .. ‘‘కురేన్ ఘాట్’ చిత్రంలోని కథ చాలా కొత్తగా ఉంటుంది. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాత శంకర్, డైరెక్టర్ విజయ్ గారికి థాంక్స్. మంచి కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రాబోతోంది. అందరూ తప్పకుండా ఆదరించండి’ అని అన్నారు.







