‘కాకా’ నుంచి ‘ఆటో జానీ’ గా మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ లుక్ రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కాకా’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం సినిమా ఫైనల్ పార్ట్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ ఏడాది చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ సినిమాపై భారీ బజ్ క్రియేట్ చేసింది.
మరోవైపు, సినిమా రిలీజ్ డేట్‌పై వస్తున్న ఊహాగానాలకు చిరంజీవి స్వయంగా చెక్ పెట్టారు. ముందుగా ప్రకటించినట్టుగానే ‘కాకా’ 2027 జనవరి 13న థియేటర్లలోకి రానుందని స్పష్టం చేశారు. సంక్రాంతి రిలీజ్‌ను మరోసారి ధృవీకరిస్తూ మెగాస్టార్ స్టైలిష్ పోస్టర్‌ను విడుదల చేశారు. దీంతో రిలీజ్ డేట్లో ఎలాంటి మార్పు ఉండదని అభిమానులకు, సినీ ప్రేక్షకులకు క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ప్రకటించినట్టుగా సినిమా ఫస్ట్ సింగిల్‌ను త్వరలోనే విడుదల చేయనున్నారు.
ఇవి కూడా చదవండి
చిరంజీవి తన X అకౌంట్ కొత్త పోస్టర్‌ను షేర్ చేస్తూ తన పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. “ఆటో జానీ గుర్తున్నాడా? 😉 ఈ సంక్రాంతికి సరికొత్తగా #KAAKA లో మీ ముందుకు వస్తున్నాడు! ఈ సంక్రాంతికి ‘ఆటో జానీ’ సరికొత్త కోణంలో మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఎదురుచూస్తున్నాను. #KAAKA ను ఒక మెమరబుల్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌గా మార్చేందుకు బాబీ, చిత్రబృందం ఎంతో కష్టపడుతున్నారు. 2027 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో కలుద్దాం. ❤️ సంక్రాంతికి కలుద్దాం 🤗” అని పోస్ట్ చేశారు.
ఈ సినిమాలో చిరంజీవి డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్లో ఆయన వింటేజ్, యంగ్ లుక్‌లో ఆకట్టుకున్నారు. సన్‌గ్లాసెస్, బ్లాక్ వెస్ట్‌పై బ్రౌన్ షర్ట్, కార్గో ప్యాంట్స్‌తో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. షర్ట్ కాలర్ పైకి లేపి, నడుముకు గన్ పెట్టుకుని మెగాస్టార్ ఇచ్చిన పోజ్ పోస్టర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వెనుక కనిపించే దుమ్ముతో కూడిన వాతావరణం, వార్మ్ టోన్ విజువల్స్ పోస్టర్‌కు రఫ్ అండ్ గ్రిటీ ఫీల్‌ను తీసుకొచ్చాయి. బ్యాక్‌గ్రౌండ్‌లో కొంతమంది నడుచుకుంటూ వస్తున్న దృశ్యం చిరంజీవి హీరోయిజాన్ని మరింత ఎలివేట్ చేస్తోంది.
ఈ సినిమాలో అనస్వర రాజన్, నివేతా థామస్, బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అండ్ యాక్టర్ అనురాగ్ కశ్యప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే అనస్వర రాజన్‌ను ‘అమ్ములు పాప’గా పరిచయం చేసిన మేకర్స్, ఆమెను ‘హార్ట్ ఆఫ్ కాకా’గా ప్రజెంట్ చేశారు.
ఈ సినిమాకు టాప్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ చూస్తున్నారు. ఆంటోనీ ఎల్. రూబెన్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందించగా, హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి అడిషనల్ స్క్రీన్‌ప్లే అందించారు. భాను-నందు డైలాగ్స్ రాశారు.







