ఓటీటీకి ఇప్పట్లో రామాయణం రాదు.. నిర్మాత కీలక ప్రకటన!
రణబీర్ కపూర్(Ranbir kapoor), సాయి పల్లవి(Sai pallavi), యష్(Yash) ప్రధాన పాత్రల్లో నటించిన భారీ పౌరాణిక మూవీ రామాయణ(Ramayana) మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై నిర్మాత నమిత్ మల్హోత్రా(Namith malhotra) చేసిన కామెంట్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. థియేటర్లలో అద్భుతమైన అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో సినిమాను రూపొందించామని ఆయన క్లారిటీ ఇచ్చారు. దీంతో డిజిటల్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు ఇప్పట్లో నిరాశ తప్పేలా లేదు.
డీడీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ, రామాయణ: పార్ట్1 డిజిటల్ రైట్స్ ను ఇప్పటివరకు ఏ ఓటీటీ సంస్థకు విక్రయించలేదని వెల్లడించారు. అంతేకాదు, ప్రముఖంగా ప్రచారంలోకి వచ్చిన రూ.450 కోట్ల జియోహాట్‌స్టార్ డీల్ వార్తలను కూడా ఆయన ఖండించారు. ప్రస్తుతం ఎలాంటి స్ట్రీమింగ్ డీల్ చేసుకునే ఆలోచన లేదని తేల్చిచెప్పారు.
ఇవి కూడా చదవండి
నితేష్ తివారీ(Nitesh tiwari) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ప్రిస్టీజియస్ సినిమాను ముందుగా సిల్వర్ స్క్రీన్‌పైనే ఆస్వాదించాలని నిర్మాత భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీ ఆడియన్స్ మరికొంత కాలం వేచి చూడాల్సి ఉంటుంది. ఇక ఈ ఇతిహాస కథకు సీక్వెల్ గా రూపొందనున్న రామాయణ: పార్ట్2(Ramayana part2)ను 2028లో సమ్మర్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ టార్గెట్ గా పెట్టుకున్నారు.







