అలియాస్ రుక్మిణిపై నాని సెన్సేషనల్ ఛాలెంజ్ !
యంగ్ హీరో నితిన్(nithin) నటించిన తాజా లవ్ స్టోరీ అలియాస్ రుక్మిణి(Alias rukmini). మురళీకాంత్ దేవసోత్(Muralikanth devasoth) దర్శకత్వంలో నాని సమర్పణలో దీప్తి గంటా(Deepthi ganta) ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచాయి. తాజాగా నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్ కు దిల్ రాజు(Dil raju), శైలేష్ కొలను(Sailesh kolanu), వెంకీ అట్లూరి(venky atluri), రామ్ జగదీష్(Ram jagadeesh) గెస్టులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నితిన్‌కు ఈ సినిమా స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ అవుతుందని దిల్ రాజు ఆకాంక్షించారు.
కాగా ఈ ఈవెంట్ లో నాని చేసిన కామెంట్స్ వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సినిమా చూసి థియేటర్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు అలియాస్ రుక్మిణి గురించి ఒక మంచి సినిమా చూశామనే అనుభూతి కలగకపోతే తాను సినిమాల నిర్మాణాన్ని ఆపేస్తానని సవాల్ విసిరారు. అంతేకాదు యాంకర్ సుమ(Suma) కూడా యాంకరింగ్ మానేస్తారని సరదాగా అన్నారు. కృష్ణ గా నితిన్ యాక్టింగ్ తనను ఆశ్చర్యపరిచిందని, హీరోయిన్ ఆఫియా సయ్యద్(Aafia syed) మొదటి సినిమాతోనే ఆకట్టుకుందని ప్రశంసించారు. ప్రేమకు అత్యున్నత స్థానం ఇచ్చే కథను డైరెక్టర్ అద్భుతంగా తెరకెక్కించారని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
మంచి సినిమా కోసం ఎదురుచూస్తున్న టైమ్ లో అలియాస్ రుక్మిణి ఛాన్స్ ను అందించిన నానిలో దేవుడిని చూశానని నితిన్ ఎమోషనల్ అయ్యారు. ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే ఎమోషన్స్ ఈ సినిమాలో ఉన్నాయని, తన కెరీర్లో మర్చిపోలేని సక్సెస్‌గా నిలుస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మేకర్స్ వ్యక్తం చేస్తున్న ధీమా సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. డిసెంబర్ 3న ప్రీమియర్స్‌తో సందడి చేయనున్న ఈ సినిమా డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.







