పవన్ కల్యాణ్ బర్త్ డే స్పెషల్ .. జై కొట్టు లోగో ఆవిష్కరణ
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) పుట్టినరోజు సందర్భంగా పిఠాపురంలో ఏర్పాటు చేసిన సభ లో మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) పార్టీ యువజన విభాగం జై కొట్టు లోగో (JaiKottu logo)ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కార్యకర్తలకు ఆడియో సందేశం ఇచ్చారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ చెయ్యెత్తి జై కొట్టు నినాదం మనందరినీ ఎంతో కదిలిస్తుంది. ఆ స్ఫూర్తిని మీకు అందించాలనే అధినేత పవన్ ఈ లోగో పెట్టారు. జై కొట్టు నినాదంతో ముందుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. రాజకీయాల్లో యువత (Youth)కు ప్రత్యేక స్థానం కల్పించాలనే ఈ విభాగాన్ని ఏర్పాటు చేశాం. అరుపులు కేకలు కాదు క్రమశిక్షణ ఎంతో ముఖ్యం. అధినేత ఆదేశాలను జనసైనికులు క్రమశిక్షణతో పాటించాలి అనిన సూచించారు.








