మంత్రి సత్యకుమార్‌కు కీలక బాధ్యతలు
బీజేపీ జాతీయ నేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ (Satya Kumar Yadav)కు పార్టీ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది. సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాల దక్షిణాది రాష్ట్రాల (Southern states) ఇన్ఛార్జిగా సత్యకుమార్‌ను నియమించింది. మోదీ (Modi) 25 ఏళ్ల ప్రజాసేవ సందర్భంగా దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబరు 17 వరకు బీజేపీ ( BJP), ఎన్డీయే (NDA) ప్రభుత్వాల ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ కార్యక్రమాలకు సత్యకుమార్ దక్షిణాది రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా వ్యవహరించనున్నారు.








