పవన్ కల్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ( Chandrababu) ఆయనకు ఫోన్లో శుభాకాంక్షలు (Best wishes) తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో నిండునూరేళ్లు వర్థిల్లాలని, మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. అనేక సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలతో పంచాయతీరాజ్‌శాఖ (Panchayat Raj Department) లో పవన్ కల్యాణ్ పెనుమార్పులు తెస్తున్నారు. గిరిజనుల కష్టాలు తీర్చేందుకు రహదారుల నిర్మాణం నుంచి పచ్చదనం పెంపు వరకూ ఆయన తీసుకుంటున్న చర్యలు ఉత్తమ ఫలితాల్ని ఇస్తున్నాయి. రాష్ట్ర పునర్మిర్మాణం కోసం ప్రజలకిచ్చిన మాట నిజం చేసేలా అనునిత్యం పనిచేస్తున్నారు. అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా ఉండే ఆయన మరిన్ని పుట్టినరోజులు చేసుకోవాలి. ఆ దేవదేవుడి ఆశీస్సులు ఆయనపై ఉండాలి అని చంద్రబాబు పేర్కొన్నారు.








