పెంటగాన్ చెబుతోంది తప్పుడు సమాచారమేనా..? జేడీవాన్స్ ఆందోళన..!
ఇరాన్ యుద్ధంలో అమెరికా గెలిచిందా..? ఓడుతోందా..? ఈ విషయం అమెరికా అధినాయకత్వానికి సైతం తెలియడం లేదు. పెంటగాన్ ఇస్తున్నసమాచారాన్ని ప్రపంచంతో పంచుకుంటున్నారు అధ్యక్షుడు ట్రంప్. అయితే అందులో నిజమెంత అనేది అనుమానాస్పదంగా మారుతోంది. ఓవైపు ఇరాన్ తో యుద్ధంలో విచ్చలవిడిగా ఆయుధాలు వాడడం వల్ల..వాటి సంఖ్య తగ్గిపోతోందని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మీడియా చెబుతోంది. అక్కడి అధికారులు సైతం ఆందోళన చెందుతున్నారు.అయితే అధ్యక్షుడు ట్రంప్ మాత్రం మనం గెల్చి తీరతామంటున్నారు.
ఇరాన్‌తో యుద్ధం (Iran War) మొదలైన రోజే ఆ దేశ సుప్రీం లీడర్ మృతి చెందారు. దాంతో అక్కడ పాలనా వ్యవస్థ కూలిపోయి, తమ అనుకూల ప్రభుత్వం ఏర్పడుతుందని అమెరికా భావించింది. కాని అలా జరగలేదు. తమ మిలిటరీ శక్తి ముందు ఇరాన్ నిలబడలేదన్న అంచనాలు తప్పాయి. దాంతో యుద్ధం ముగింపు కోసం అగ్రరాజ్యం మల్లగుల్లాలు పడుతోంది.
ఇవి కూడా చదవండి
ఈ నేపథ్యంలో యుద్ధం గురించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు రక్షణశాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ నుంచి సరైన సమాచారం అందడం లేదన్న వార్తలు వస్తున్నాయి. యూఎస్ రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ డాన్ కెయిన్ ఇస్తున్న వివరాలపై ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) ఆందోళన వ్యక్తంచేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనం పేర్కొంది.
ఇరాన్ సైనిక శక్తిని భారీగా దెబ్బతీశామని, అమెరికాలో ఆయుధ నిల్వలు మెరుగ్గానే ఉన్నాయని పీట్ హెగ్సెత్, కెయిన్ చేస్తోన్న ప్రకటనలపై జేడీ వాన్స్ అనుమానాలు వ్యక్తంచేశాసినట్లు సమాచారం. అధ్యక్షుడికి ఇస్తోన్న ఆ సమాచారంపై అంతర్గత సమావేశంలో వాన్స్ పదేపదే ప్రశ్నలు వేశారట. అమెరికా (USA) వద్ద కీలక క్షిపణి నిల్వలు తరిగిపోతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిల్వల తరుగుదలను తక్కువ చేసి చూపిస్తున్నారా..? అని వారిని అడిగినట్లు పేర్కొంది.
భవిష్యత్తులో రష్యా, ఉత్తర కొరియా, చైనాలతో ఏవైనా ఘర్షణలను ఎదుర్కోవాల్సివస్తే.. ఈ క్షిపణి నిల్వల కొరత తీవ్ర పరిణామాలకు దారితీయొచ్చని ఉపాధ్యక్షుడు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ మేరకు సంబంధిత అధికారులను పేర్కొంటూ అంతర్జాతీయ మీడియా తన కథనంలో రాసుకొచ్చింది. ‘‘హెగ్సెత్, కెయిన్ అధ్యక్షుడిని తప్పుదోవ పట్టించారని ఆరోపించకుండా.. వాన్స్ తన భయాలను మాత్రం వ్యక్తంచేశారు’’ అని వెల్లడించింది.
ఇవి కూడా చదవండి






