డెమొక్రాటిక్ పార్టీలో సంస్కరణలు అవసరం..రో ఖన్నా పిలుపు..!
తమ పార్టీ శ్రామిక వర్గ అమెరికన్లతో సంబంధాలు ఏర్పరచుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు డెమొక్రాటిక్ పార్టీ ప్రతినిధి రో ఖన్నా. ప్రధానంగా ఓటర్లు పెరుగుతున్న జీవన వ్యయాలు, ఆర్థిక అభద్రతపై దృష్టి పెట్టారన్నారు. ప్రస్తుత ఆర్థిక, రాజకీయ వ్యవస్థ పనితీరు పట్ల వారు అసంతృప్తితో ఉన్నారన్నారు రోఖన్నా. ముఖ్యంగా యువత ఇళ్లు కొనలేక, ఉద్యోగాలు సంపాదించలేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తు చేశారు.
‘డెమోక్రటిక్ పార్టీకి సంస్కరణలు అవసరమని సూచించారు రోఖన్నా.. శ్రామిక వర్గ అమెరికన్లకు ఈ పార్టీ తగినంత అండగా నిలవడం లేదన్నారు. మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి. రూజ్వెల్ట్ ప్రతిపాదించిన ఆర్థిక ప్రాధాన్యతలకు డెమోక్రాట్లు తిరిగి రావాలని అన్నారు.ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో నష్టపోయిన “సాధారణ అమెరికన్లకు” సహాయం చేయడంపై దృష్టి సారిస్తే… ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు.
డమొక్రాటిక్ హౌస్ ప్రైమరీల్లో ఇటీవల డెమొక్రాట్లు ఓటమి పాలయ్యారు.వీరిపై ప్రగతి శీల , ప్రజాస్వామ్య, సోషలిస్టు అభ్యర్థులు విజయం సాధించారు. ఈ విజయాల పరంపర.. ఆర్థిక వ్యవస్థపై ఓటర్లలో పెరుగుతున్న అసంతృప్తిని ప్రతిబింబిస్తోందని రో ఖన్నా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాథమిక ఎన్నికల ఫలితాలను .. సంస్కరణలకు ఓ పిలుపుగా భావించాలని ఖన్నా చెబుతున్నారు.








