మధ్యవర్తిగా పాక్ పనికిరాదు.. పరువు తీసేస్తున్న ఇరాన్.. !
పాపం.. పాకిస్తాన్.. ఆర్థిక సుడిగుండం నుంచి ఒడ్డెక్కేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పందం కుదిర్చి..అమెరికా, అంతర్జాతీయ సమాజం నుంచి సాయం పొందుదామంటే.. అది కుదిరేలా కనిపించడం లేదు. ఎందుకంటే.. మధ్యవర్తిత్వం చేసేందుకు పాకిస్తాన్ ఎంతగాప్రయత్నిస్తున్నా.. కాలం కలిసి రావడం లేదు. ఇరుదేశాలు.. పాకిస్తాన్ ను ఓ బ్రోకర్ గానే చూస్తున్నాయి. తప్ప, దానికి ఎలాంటి క్రెడిట్ ఇవ్వడం లేదు.
లేటెస్టుగా ఇస్లామాబాద్ వేదికగా .. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ను కలిశారు ఇరాన్ విదేశాంగమంత్రి అరాఘ్చీ. అంతేనా తమ వంతుగా డిమాండ్లను పాక్ ప్రధానికి అందించారు. వీటిని అమెరికాకు అందించాల్సిందిగా సూచించారు. అయితే ఈ మాత్రం దానికి తమ ప్రతినిధులను పాక్ కు పంపడం లేదని తేల్చేశారు ట్రంప్.ఏమీ లేనిదానికి అంతదూరం ప్రయాణం ,ఖర్చు అనవసరమన్నారు.
ఇటు ఇరాన్ కూడా ఏమీ తక్కువ తినలేదు. ఇరాన్ ఎంపీ రెజాయి.. కీలక వ్యాఖ్యలుచేశారు. పాకిస్తాన్ మంచి పొరుగుదేశం, మిత్రదేశమని ప్రశంసించారు. అంతలోనే.. ఆ దేశం మధ్యవర్తిత్వానికి పనికి రాదని స్పష్టం చేశారు. ఎందుకంటే పాకిస్తాన్.. అమెరికాకు చర్చల్లో వంతపాడుతోందని ఆరోపించారు.మధ్యవర్తిగా ఉండే దేశం.. ఏ ఒక్క దేశానికి వంతపాడకూడదని తెలిపింది. కానీ పాక్.. అదే పని చేస్తోందని ఆరోపించారు. అంటే.. అక్కడ పాక్ ప్రయత్నం తుస్సుమంది.
దీనికి తోడు పాకిస్తాన్ చర్చల పేరుతో లాక్ డౌన్ విధించడం.. ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో విలవిలలాడుతుంటే.. వేరే దేశాల చర్చలకు మధ్యవర్తిత్వం వహించడమేంటని ప్రజలు ప్రశ్నించిన పరిస్థితి. అంటే ప్రజల్లోనూ మంచి మార్కులు పడలేదు. అంటే వ్రతం చెడినా ఫలితం దక్కలేదన్నమాట. ఇప్పుడేం చేయాలా అన్న మీమాంసలో పడింది పాక్ సర్కార్.
ఇవి కూడా చదవండి








