డీ లిమిటేషన్ బిల్ పాస్ తథ్యం.. !
నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందుతుందని కేంద్రం ధీమా వ్యక్తం చేసింది. తమకు 371 మంది సభ్యుల మద్దతు ఉందని తెలిపింది. బిల్లు ముసాయిదా (Delimitation bill) వెల్లడించిన తర్వాత తమకు మద్దతుగా వచ్చే పార్టీలు, ఎంపీల సంఖ్య పెరిగిందని వెల్లడించింది. మరోవైపు, డీలిమిటేషన్ కమిషన్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న ఆందోళనలను ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చాయి. గతంలో ఉన్న చట్టంలో మహిళా రిజర్వేషన్, సీట్ల పెంపు మినహా మిగతా ఏమీ మార్చలేదని స్పష్టం చేశాయి.
ఇవి కూడా చదవండి
2029లోనే మహిళా రిజర్వేషన్..
డీలిమిటేషన్ బిల్లు అమలు తక్షణ అవసరం అని ప్రభుత్వం అభిప్రాయపడింది. ఇది ఇప్పుడు ఆమోదం పొందితే 2029 లోక్‌సభ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లను అమలు చేయవచ్చని పేర్కొంది. లేదంటే 2034 వరకు వేచిచూడాల్సిందేనని తెలిపింది. డీలిమిటేషన్ కమిషన్‌పై విపక్షాలు చేస్తున్న ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది.
కమిషన్ ఏర్పాటు విధివిధానాలు..
ప్రతిపాదిత బిల్లు ప్రకారం.. డీలిమిటేషన్ కమిషన్‌లో ఛైర్మన్.. సుప్రీం కోర్టు న్యాయమూర్తి లేదా రిటైర్డ్ జడ్జి ఉంటారు. ఎన్నికల ప్రధాన కమిషనర్ లేదా ఒక ఎన్నికల కమిషనర్ సభ్యులుగా ఉంటారు. రాష్ట్రాల విషయానికొస్తే.. రాష్ట్ర ఎలక్ట్రోల్ అధికారి కూడా డీలిమిటేషన్ కమిషన్‌లో సభ్యులుగా ఉంటారు. ప్రతి రాష్ట్రం నుంచి ఐదుగురు ఎంపీలు, ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా సభ్యులుగా ఉండనున్నట్లు తెలుస్తోంది. డీలిమిటేషన్ కమిషన్ నివేదికను పార్లమెంట్లో ప్రవేశపెడతారని.. దీనిలో మార్పులు చేసేందుకు, తిరస్కరించేందుకు పార్లమెంట్‌కు అధికారం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.







