బీజేపీని ఇరకాటంలోకి నెట్టేసిన ఎంపీ తేజస్వీ సూర్య
బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తన సొంత పార్టీనే ఇరకాటంలోకి నెట్టేశారు. లోక్ సభలో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషప్ బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ మాట్లాడుతూ.. యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను దారుణంగా విభజించిందన్నారు తేజస్వీ సూర్య. బ్రిటీష్ వాళ్లు చేసిన భారత్-పాక్ విభజన కంటే దారుణంగా ఉమ్మడి ఏపీ విభజన జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ వారసత్వం అటువంటిదని ఆరోపించారు. తేజస్వీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. తెలంగాణ ఉద్యమం, అమరవీరులను ఎంపీ అవమానించారని ధ్వజమెత్తారు. దీంతో వివాదం చెలరేగింది.
అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీఆర్ఎస్ రెండూ ఇప్పుడు బీజేపీని టార్గెట్ చేశాయి. తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ విషం చిమ్ముతోందని, తేజస్వీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. పార్లమెంట్ వేదికగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచిన తేజస్వి సూర్య వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, తమ ఎంపీలే లోక్ సభలో వుంటే పరిస్థితి వేరుగా వుండేదని మండిపడ్డారు.
ఇక.. మరోవైపు కాంగ్రెస్ కూడా తేజస్వీ సూర్యపై భగ్గుమంది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచారని నేతలు మండిపడుతున్నారు. ఆయన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆయన ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేసి, పార్లమెంట్ నుంచి బర్తరఫ్ చేయాలని, ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తేజస్వీ సూర్యపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఏకంగా డీజీపీకి లేఖ రాశారు.
ఇవి కూడా చదవండి
సొంత పార్టీనే ఇరకాటంలోకి నెట్టేసిన తేజస్వీ సూర్య…
ఆంధ్ర, తెలంగాణ విభజనను భారత్ పాక్ విభజనతో పోల్చడమే అసలు వివాదమై కూర్చుంది. నిజానికి తేజస్వీ సూర్య వాగ్దాటి బాగుంటుంది. చాలా విషయాలపై ఆయన అత్యంత క్లారిటీగా, అందర్నీ ఆకట్టుకునే విధంగానే మాట్లాడతారు. అయితే.. తాజాగా మాత్రం లోక్ సభలో తెలంగాణ ప్రత్యేక ఏర్పాటు విషయంలో మాత్రం కాస్త టెన్షప్ పుట్టించారు.
తెలంగాణలో ఎలాగైనా బీజేపీని రాజకీయంగా దెబ్బకొట్టాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎదిరి చూస్తున్నాయి. తాజాగా ఎంపీ తేజస్వీ వారిద్దరికీ, తెలంగాణవాదులకు నేరుగా ఆయుధాన్ని చేతిలో పెట్టేసినట్లైంది. దీంతో బీజేపీపై రాజకీయ నేతలు, తెలంగాణ వాదులు విరుచుకుపడుతున్నారు. తెలంగాణలో ఎలాగైనా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ పట్టుదలతో వుంది. ఇందు కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తోంది.
ఇప్పటికే తెలంగాణ బీజేపీలో గ్రూపు రాజకీయాలు రెచ్చిపోయాయి. నాలుగు స్తంభాలాటలాగా నడుస్తోంది. దీంతో కేడర్ కి ఏం చేయాలో పాలుపోవడం లేదు. దీంతో అధిష్ఠానం కూడా పదే పదే జోక్యం చేసుకుంటోంది. నేతలకు క్లాస్ తీసుకుంటోంది. అయినా సరే … నేతలు వినడం లేదు. దీంతో జరిగిపోవాల్సిన నష్టం జరిగిపోతోంది.
ఇది నడుస్తుండగానే అత్యంత సెంటిమెంట్ తో కూడిన, ఆత్మ గౌరవానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎంపీ తేజస్వీ సూర్య ఏకంగా భారత్, పాక్ విభజనతో పోల్చే సరికి ఇక్కడి పార్టీ నేతలు ఇరకాటంలో పడిపోయారు. తేజస్వీ మాటలను బీఆర్ఎస్, కాంగ్రెస్ వక్రీకరిస్తోందని, తేజస్వీ తెలంగాణ ఏర్పాటును కించపరచలేదని బీజేపీ పదే పదే స్పష్టతనిస్తోంది. అయినా సరే.. తేజస్వీ మాటలు దుమ్ము దుమారాన్ని రేపుతున్నాయి.
ఇవి కూడా చదవండి








