Gas Charges: హోటల్స్‌లో ‘గ్యాస్ చార్జీల’ మోత.. ఎల్పీజీ కొరతతో కస్టమర్లపై భారం!
దేశవ్యాప్తంగా నెలకొన్న కమర్షియల్ ఎల్పీజీ (LPG) సిలిండర్ల తీవ్ర కొరత ఇప్పుడు నేరుగా సామాన్యుల జేబులకు (Gas Charges) చిల్లులు పెడుతోంది. మార్కెట్లో గ్యాస్ సిలిండర్ల లభ్యత అనూహ్యంగా తగ్గిపోవడం, బ్లాక్ మార్కెట్లో వాటి ధరలు అమాంతం పెరిగిపోవడంతో రెస్టారెంట్లు, హోటళ్ల నిర్వహణ తీవ్ర సంక్షోభంలో పడింది. ఈ ఊహించని ఆర్థిక భారాన్ని మోయలేక కొన్ని యాజమాన్యాలు ఆ అదనపు ఖర్చును నేరుగా వినియోగదారులకే బదిలీ చేస్తున్నాయి.
ముఖ్యంగా బెంగళూరు, చెన్నై లాంటి ప్రధాన నగరాల్లోని రెస్టారెంట్లు అనుసరిస్తున్న ఈ కొత్త విధానం (Gas Charges) ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీస్తోంది. కస్టమర్లు ఆర్డర్ చేసిన ఆహార పదార్థాల అసలు బిల్లుకు అదనంగా ‘గ్యాస్ చార్జీలు’ (Gas Charges) పేరుతో అదనపు రుసుమును వసూలు చేస్తున్నాయి. ఈ తరహా బిల్లులకు సంబంధించిన రసీదుల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఉదాహరణకు, చెన్నైలోని ప్రముఖ రెస్టారెంట్ గీరాస్ (Geeraas) జారీ చేసిన ఓ బిల్లులో, ఫుడ్ ఐటమ్స్ కు అయిన ఖర్చుతో పాటు అదనంగా రూ. 9.52ను ‘గ్యాస్ చార్జ్’ కింద వసూలు చేసినట్లు స్పష్టంగా నమోదై ఉంది. ఇదే తరహాలో, మరో రెస్టారెంట్ ఏకంగా ‘గ్యాస్ సప్లై ఇష్యూ’ (Gas supply issue) అనే కారణాన్ని చూపుతూ ప్రతి వినియోగదారుడి బిల్లుపై రూ. 30 చొప్పున అదనపు ఛార్జీని బాదుతోంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
రెస్టారెంట్ల తాజా తీరుపై భోజన ప్రియులు, నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఫుడ్ కోసం డబ్బులు చెల్లించిన తర్వాత, దాన్ని వండటానికి ఉపయోగించే గ్యాస్‌కు (Gas Charges) కూడా కస్టమర్లే అదనంగా డబ్బులు చెల్లించాలా అని వారు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఇది దోపిడీ అంటూ మండిపడుతున్నారు. అయితే, ఈ విమర్శలపై రెస్టారెంట్ యజమానుల వాదన మరోలా ఉంది. తాము కస్టమర్లను ఏమాత్రం మోసం చేయడం లేదని, తమ వ్యాపారంలో పారదర్శకత (Transparency) కోసమే గ్యాస్ చార్జీని బిల్లులో ప్రత్యేకంగా చూపిస్తున్నామని సమర్థించుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న గ్యాస్ కొరత, బ్లాక్ మార్కెట్ ధరల కారణంగా తాము భారీ నష్టాలు ఎదుర్కొంటున్నామని వారు వివరిస్తున్నారు. ఈ కష్టకాలంలో మెనూలోని ఆహార పదార్థాల రేట్లను శాశ్వతంగా పెంచే బదులు, కేవలం గ్యాస్ కోసం అవుతున్న అదనపు ఖర్చును (Gas Charges) మాత్రమే బిల్లులో విడిగా పొందుపరుస్తున్నామని యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి








