ప్రస్తుతం 81 మంది ఉన్నాం.. త్వరలో ఆ సంఖ్య 181 అవుతుంది
మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాను మద్దతిస్తున్నట్లు బీజేపీ ఎంపీ హేమమాలిని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మహిళల కోసం తీసుకున్న ఈ గొప్ప నిర్ణయంతో సెప్టెంబరు 19 చారిత్రాత్మక రోజుగా మారింది. నూతన పార్లమెంటులో ప్రవేశ పెట్టిన ఈ మొదటి బిల్లు త్వరలోనే ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నాం. ప్రస్తుతం 81 మంది మహిళా ఎంపీలున్నారు. ఈ బిల్లు తర్వాత మా సంఖ్య దాదాపు 181 అవుతుంది. దీంతో మహిళా ప్రాతినిధ్యం పెరుగుతుంది. మహిళలకు ఆకాశమే హద్దు. కాబట్టి మరింత ఉత్సాహంతో ప్రజా జీవితంలో పని చేసేందుకు వారు ముందుకు రావాలి అంటూ ఆమె సంతోషం వ్యక్తం చేశారు.













