XU feihong: మాకష్టంతోనే ఎదుగుతున్నాం.. విదేశాల దయతో కాదన్న చైనా..
న్యూఢిల్లీ రైసినా డైలాగ్ లో అమెరికా ఉప విదేశాంగ కార్యదర్శి క్రిస్టోఫర్ లాండౌ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ముఖ్యంగా చైనా ఆర్థికంగా ఎదిగేందుకు గతంలో అమెరికా ఇచ్చిన వెసులుబాటును లాండౌ ఒక “తప్పు”గా అభివర్ణించారు. 20 ఏళ్ల క్రితం చైనాకు మార్కెట్ యాక్సెస్ ఇచ్చి, ఇప్పుడు అమెరికాకు అది ఒక పెద్ద సవాలుగా మారిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. భారత్ విషయంలో అటువంటి పొరపాటు చేయబోమని, అంటే భారత్ అమెరికాకు వాణిజ్యపరంగా గట్టి పోటీదారుగా మారకుండా జాగ్రత్త పడతామని ఆయన స్పష్టం చేశారు.
భారత్ – చైనా యువజన చర్చల కార్యక్రమంలో పాల్గొన్న చైనా రాయభారి షు ఫీహంగ్ .. అమెరికా వ్యాఖ్యలకు గట్టి కౌంటరిచ్చారు. కఠోర శ్రమ వల్లే కొన్ని దశాబ్దాలుగా భారత్, చైనా దేశాలు అభివృద్ధి సాధించాయి తప్ప.. విదేశాల దయతో కాదని అన్నారు. ముఖ్యంగా భారత (India) అభివృద్ధిని ప్రశంసిస్తూనే.. ఇండియా , చైనా కలిసికట్టుగా, స్నేహభావంతో ముందుకు సాగాలన్నారు..
‘ఇటీవల కాలంలో భారత్- చైనా అద్భుతమైన అభివృద్ధిని సాధించాయి. ఈ విజయాలు ఇరుదేశాల ప్రజల శ్రమ ఫలితమే తప్ప ఇందులో ఇతర దేశాల దయ ఏమీ లేదు’ అని పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాల కోసం ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. పొరుగు దేశాల మిత్రులుగా.. భారత్- చైనా కొనసాగాలని, పరస్పర విజయం కోసం కలిసి పనిచేయాలన్నారు. అయితే, తమ మధ్య సంబంధాలు బలపడటం కొందరికి ఇష్టం లేదన్నారు. ఉద్దేశపూర్వకంగానే ఇరుదేశాల మధ్య విభేదాలను పెంచి, వారు లాభం పొందాలని చూస్తున్నారన్నారు.
ఇవి కూడా చదవండి








