సౌదీ తప్ప ఏదేశం నౌకలు మాటార్గెట్ కాదు..హూతీలు
సౌదీ అరేబియాపై హూతీ తిరుగుబాటుదారుల (Houthis) దాడులు మరింత ముమ్మరమయ్యాయి. క్షిపణులు, డ్రోన్లతో తిరుగుబాటుదారులు విరుచుకుపడుతున్నారు. ఈపరిణామాల నడుమ హుతీలు కీలక ప్రకటన చేేశారు. తాము అమెరికా నౌకలపై దాడులు చేయమన్నారు. హుతీలపై అమెరికా స్వయంగా దాడులకు దిగే అవకాశాలను అమెరికా పరిశీలిస్తోందన్న వార్తల నడుమ వారు ఈ కీలక ప్రకటన చేశారు.
ఎర్ర సముద్రం (Red Sea)లో అమెరికా నౌకల (US ships)ను లక్ష్యం చేసుకోబోమన్నారు హుతీలు. ఈ విషయంలో ఇప్పటికే అగ్రరాజ్యంతో చర్చలు జరిపినట్లు హూతీల పొలిటికల్ విభాగం సభ్యుడు మొహమ్మద్ అల్ బుఖైతీ వెల్లడించారు. ఇతర దేశాల నౌకల జోలికి కూడా వెళ్లబోమన్నారు.
‘సౌదీని మినహాయిస్తే ఈ ఎర్ర సముద్రంలో మరే ఇతర దేశాల నౌకలను లక్ష్యంగా చేసుకోలేదు. ఇకపై చేసుకోము కూడా. ఇతర దేశాలు మాకు వ్యతిరేకంగా సౌదీ అరేబియాతో చేతులు కలపనంత వరకూ మేము ఎవరి జోలికీ వెళ్లము. లేదంటే ఘర్షణను విస్తరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎర్ర సముద్రాన్ని ఏడెన్ గల్ఫ్‌ను కలిపే కీలక సముద్ర మార్గమైన బాబ్ అల్-మండేబ్ జలసంధిని మూసివేయాలని అనుకోవట్లేదు. యెమెన్ సహా ప్రతి ఒక్కరికీ జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛను కల్పించడమే మా లక్ష్యం’ అని బుఖైతీ పేర్కొన్నారు.
ఇరాన్ (Iran) నాగరికతను తుడిచిపెట్టేలా దాడులు చేస్తామంటూ ట్రంప్ (Donald Trump) చేసిన బెదిరింపులను ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఘాలిబఫ్ తిప్పికొట్టారు. అగ్రరాజ్యం హద్దు మీరితే భీకర దాడులు చేస్తామని హెచ్చరించారు. టెహ్రాన్ షరతులను వాషింగ్టన్ అంగీకరించే వరకు చర్చల ప్రసక్తే లేదని.. హర్మూజ్‌లో రాకపోకలను పునరుద్ధరించే అవకాశమే లేదని స్పష్టం చేశారు. తమ దేశంపై దాడులకు అమెరికా మళ్లీ సిద్ధమవుతున్నట్లు తమకు సమాచారం అందిందన్నారు.








