మోక్షజ్ఞ డెబ్యూ.. మాస్ హీరో కాదు, సొంత బ్రాండ్ కోసమేనా?
నందమూరి మోక్షజ్ఞ(nandamuri mokshagna) సినీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వశిష్ఠ(Vassishta) దర్శకత్వంలో ఆయన డెబ్యూ మూవీకి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే మోక్షజ్ఞను మొదటి సినిమాతోనే బాలకృష్ణ మాస్ ఇమేజ్‌కు దగ్గరగా తీసుకెళ్లడం కంటే.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు వచ్చేలా లాంచ్ చేయాలనే ఆలోచనతో కథను సిద్ధం చేసినట్లు ఇండస్ట్రీలో డిస్కషన్ జరుగుతోంది. అందుకే రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా సోషియో ఫాంటసీ అంశాలతో కూడిన కథను ఎంచుకున్నారనే టాక్ వినిపిస్తోంది.
పునర్జన్మలు, విభిన్న కాలపరిమాణాలు, భారీ విజువల్ ఎఫెక్ట్స్ వంటి అంశాలు కథలో కీలకంగా ఉండే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ తరహా కాన్సెప్ట్ మోక్షజ్ఞకు తొలి సినిమాతోనే ఒక ప్రత్యేకమైన స్క్రీన్ ఇమేజ్ను తీసుకొచ్చే అవకాశముంది. అంతేకాదు, బాలకృష్ణ(Balakrishna) కూడా కథలో కీలకమైన పాత్రలో కనిపించనున్నారనే వార్త ఆసక్తిని పెంచుతోంది. కథను మలుపు తిప్పే పాత్రలో ఆయన సుమారు 40 నిమిషాల పాటు కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది.
మరోవైపు వశిష్ఠపై ఉన్న అంచనాలు, విశ్వంభర(vishwambhara) తర్వాత వచ్చిన డిస్కషన్స్ నేపథ్యంలో ఈ కాంబినేషన్‌పై కొంత నెగిటివ్ టాక్ కూడా కనిపిస్తోంది. అయితే మోక్షజ్ఞను రొటీన్ మాస్ హీరోగా కాకుండా.. మొదటి అడుగులోనే తనకంటూ ఒక కొత్త బ్రాండ్‌ను క్రియేట్ చేసేలా పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే వశిష్ఠను ఎంపిక చేశారనే వాదన కూడా వినిపిస్తోంది. అదే నిజమైతే, మోక్షజ్ఞ డెబ్యూను బాలయ్య ఇమేజ్‌కు కంటిన్యూగా కాకుండా కొత్త ప్రయాణానికి నాందిగా చూడాల్సి ఉంటుంది.








