రవితేజకు జోడీగా ఓజీ భామ
మాస్ మహారాజ్ రవితేజ(raviteja) ప్రస్తుతం ఇరుముడి(irumudi) సక్సెస్ ను ఆస్వాదిస్తున్నారు. ఈ సినిమా తర్వాత తన తర్వాతి ప్రాజెక్టుల విషయంలో మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో డైరెక్టర్ వివేక్ ఆత్రేయ(Vivek Athreya)తో రవితేజ చేయబోయే సినిమాపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా సాగుతున్నాయి. నటీనటులు, టెక్నికల్ టీమ్ ఎంపికను పూర్తి చేసే పనిలో చిత్రబృందం ఉంది. ఇప్పటికే కథ, స్క్రిప్ట్ విషయంలో వివేక్ ఆత్రేయ స్పెషల్ కేర్ తీసుకున్నట్లు సమాచారం.
ఈ ప్రాజెక్ట్‌లో రవితేజకు జోడీగా తమిళ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్(Priyanka Arul Mohan)ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. తెలుగు ఆడియన్స్ కు గ్యాంగ్ లీడర్(Gang Leader) తో పరిచయమైన ప్రియాంక.. తర్వాత ఓజీ(OG) లోనూ కనిపించారు. ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా ఉన్న ఆమె, కొంత గ్యాప్ తర్వాత మరో తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రవితేజ- ప్రియాంక కాంబినేషన్ కూడా ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా మారే అవకాశం ఉంది.
లక్ష్మణ్(Laxman) ఈ ప్రతిష్టాత్మక సినిమాను భారీ స్థాయిలో నిర్మించనున్నారు. వివేక్ ఆత్రేయ కథను ఇంట్రెస్టింగ్గా తీర్చిదిద్దడంతో పాటు, రవితేజ ఇమేజ్‌కు భిన్నమైన అంశాలను ఇందులో చూపించనున్నారనే టాక్ వినిపిస్తోంది. అక్టోబర్‌లో షూటింగ్ ప్రారంభించేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. సమ్మర్ 2027లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే టైటిల్, ఇతర నటీనటులకు సంబంధించిన వివరాలను మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశం ఉంది.








