మెగాస్టార్ చిరంజీవి, ‘కాకా’- కదిరి కాళిదాసుగా తన పాత్ర పేరును లీక్ చేసిన మెగాస్టార్
బ్లాక్‌బస్టర్ ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ఫుల్ డైరెక్టర్ బాబీ కొల్లి మరోసారి కలిసి చేస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘కాకా’. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలను నెలకొల్పుతోంది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచే అప్డేట్ వచ్చింది. ఓ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా తన క్యారెక్టర్ పేరును రివీల్ చేశారు. ‘కాకా’లో చిరంజీవి ‘కదిరి కాళిదాస్’గా కనిపించబోతున్నారు. ఈ పవర్ఫుల్ పేరు వినగానే సినిమాలో ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి మరింత పెరుగుతోంది.
‘కాకా’ హై-ఇంటెన్సిటీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బలమైన ఎమోషన్, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌కు కూడా ప్రాధాన్యత ఉంది. దీంతో సినిమాలో కదిరి కాళిదాస్ క్యారెక్టర్ జర్నీ, ఎమోషనల్ ఆర్క్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
ఈ చిత్రంలో అనస్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ చేస్తున్నారు. ఆంటోనీ ఎల్ రూబెన్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. కోన వెంకట్, కే చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందించగా, హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి రైటర్స్ గా చేస్తున్నారు. భాను-నందు డైలాగ్స్ రాస్తున్నారు.
‘కాకా’ 2027 జనవరి 13న సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.








