మాస్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని కాదు.. వాళ్లలో ఒకడిలా ఆలోచించాడు
నాని(nani) హీరోగా శ్రీకాంత్ ఓదెల(srikanth odela) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్(the paradise) పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. 1980ల నేపథ్యంతో సాగే ఈ సినిమాలో మదర్- సన్ ఎమోషన్ కథకు ప్రధాన బలంగా నిలుస్తుందని నాని తెలిపారు. యాక్షన్ సినిమాలను ఫ్యామిలీ ఆడియన్స్ రిజెక్ట్ చేయరని, స్ట్రాంగ్ ఎమోషనల్ కోర్ ఉంటే ప్రతి వర్గం ప్రేక్షకుడూ కనెక్ట్ అవుతాడని చెప్పారు. శ్రీకాంత్ ఓదెల మాస్ ఆడియన్స్ ఏం కోరుకుంటారో లెక్కలు వేసుకుని సీన్లు రాయరని, తానే ఒక మాస్ ఆడియన్ లాగా ఆలోచించి సినిమాను తెరకెక్కించాడని నాని ప్రశంసించారు. షూటింగ్ టైమ్ లో కొన్ని సీన్స్ తర్వాత థియేటర్లలో ఈ సీన్‌కు భారీ రెస్పాన్స్ వస్తుందని శ్రీకాంత్ చెప్పేవారని వెల్లడించారు.
శ్రీకాంత్ తన డ్యాన్స్‌ను ఎంతగానో ఇష్టపడతారని, అందుకే ఈ సినిమా కోసం తాను కూడా మరింతగా కష్టపడ్డానని నాని తెలిపారు. మరోవైపు అనిరుధ్ రవిచందర్(Anirudh ravichander) మ్యూజిక్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని చెప్పారు. గతంలో తన సినిమాల్లో అనిరుధ్ పూర్తి స్థాయి టాలెంట్ ను వాడుకునే అవకాశం రాలేదని, ది ప్యారడైజ్ మాత్రం ఆయనకు ఆ స్వేచ్ఛను ఇచ్చిందని నాని పేర్కొన్నారు. ఈ సినిమా అనిరుధ్ కెరీర్లోనే స్పెషల్ మూవీగా నిలిచే అవకాశం ఉందని అన్నారు. మోహన్ బాబు(mohan babu), రాఘవ్ జుయల్(Raghav Jhuyal) క్యారెక్టర్లు చాలా క్రూరంగా, అదే సమయంలో వాస్తవికంగా ఉంటాయని వెల్లడించారు.
ది ప్యారడైజ్‌లో సవారీ తెగను అణచివేతకు గురిచేసే పరిస్థితులు, వారు ఒక్కటైతే ఏం జరుగుతుందనే అంశం కీలకంగా ఉంటుందని నాని తెలిపారు. 1980ల కాలానికి తగ్గట్టుగా ప్రతి చిన్న అంశాన్ని జాగ్రత్తగా డిజైన్ చేశామని చెప్పారు. కాయదు లోహర్ క్యారెక్టర్ ఆడియన్స్ కు సర్ప్రైజ్ ఇస్తుందని, మోహన్ బాబు పాత్ర చాలా క్రూరంగా ఉంటుందని అన్నారు. సినిమా చూసిన తర్వాత మూడు, నాలుగు రోజుల పాటు ఆ ఇంపాక్ట్ ఆడియన్స్ పై ఉంటుందని నాని ధీమా వ్యక్తం చేశారు. నిర్మాత సుధాకర్ చెరుకూరి(Sudhakar cherukuri) సహనాన్ని, లేటైన టైమ్ లోనూ అందించిన సహకారాన్ని నాని ప్రత్యేకంగా ప్రశంసించారు. భారీ స్థాయిలో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.








