ఓటీటీ రిలీజ్ తర్వాత ఇరుముడిపై భారీ డిస్కషన్స్
మాస్ మహారాజ్ రవితేజ(raviteja) కెరీర్లో భారీ సక్సెస్ ను అందుకున్న సినిమాగా నిలిచిన ఇరుముడి(Irumudi) థియేటర్లలో మంచి ఆదరణను సొంతం చేసుకుంది. తండ్రీకూతురు బాండింగ్ ను ఎమోషనల్ గా ఆవిష్కరిస్తూ, భక్తి అంశాలను కథలో భాగంగా మేళవించిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించింది. ముఖ్యంగా రవితేజ యాక్టింగ్ కు ఆడియన్స్ నుంచి మంచి ప్రశంసలు దక్కాయి.
అయితే థియేట్రికల్ రన్ తర్వాత శుక్రవారం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ ప్రారంభం కావడంతో సినిమాపై సోషల్ మీడియాలో మరో రకమైన డిస్కషన్ మొదలైంది. ఓటీటీలో సినిమా చూసిన కొంతమంది ఆడియన్స్ కథలోని కొన్ని అంశాలు, లాజిక్కు సంబంధించిన విషయాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా సినిమాలోని కొన్ని సీన్స్, చైల్డ్ అబ్యూస్ అంశం కూడా డిస్కషన్ కు వస్తోంది. దీంతో సోషల్ మీడియాలో సినిమా గురించి ట్రోల్స్, విమర్శలు కనిపిస్తున్నాయి.
ఒకే సినిమాకు థియేటర్లలో లభించిన ఆదరణకు, ఓటీటీలో వస్తోన్న రెస్పాన్స్ మధ్య తేడా ఎందుకు వచ్చిందనే డిస్కషన్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. డైరెక్టర్ శివ నిర్వాణ(Siva nirvana) రూపొందించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్(mythri movie makers) నిర్మించింది. జీవీ ప్రకాష్ కుమార్(GV Prakash Kumar) ఈ సినిమాకు మ్యూజిక్ తో పాటు నేపథ్య సంగీతాన్ని అందించారు.








