రెడ్ లెహంగాలో రాయల్ లుక్ లో దిశా
ముంబైలోని అంబానీ ఇల్లు అంటిలియాలో ఇటీవల జరిగిన వినాయక చవితి వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు దేశవ్యాప్తంగా ఉన్న పలువురు బాలీవుడ్ తారలంతా తరలివచ్చారు. అయితే, ఇందులో అందరి చూపు బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ(Disha Patani) వైపే మళ్లింది. రెడ్ కలర్ రాయల్ లెహంగాలో, దగదగలాడే డైమండ్ ఆభరణాలతో ఆమె అచ్చం ఒక దేవకన్యలా మెరిసిపోయింది. ట్రెడిషన్ తో పాటు గ్లామర్ జోడించి దిశా చేసిన ఈ ఫ్యాషన్ షో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.








