శోభారాజు ఆరోగ్య శ్రేయస్సుకై శిష్యులచే సంకీర్తనౌషదం
“పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారు గత రెండు రోజులుగా తలకి కొంత గాయం కావడం మూలాన హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స చేయించుకుంటూ వచ్చారు. శిష్యులందరికి ఈ విషయం కలవరపరచింది. కావున అన్నమయ్యపురంలో ఈ శనివారం అన్నమ స్వరార్చనలో అందరూ కూడా దైవ ప్రార్థన చేయాలని సంకల్పించారు. ఆ తర్వాత శోభారాజుకి కొంచెం బాగైన తర్వాత, కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి మంచి ఆరోగ్యంతో బయటపడే సందర్భంగా అన్నమ స్వరార్చనలో ప్రత్యేకంగా శోభారాజు గారి ఆరోగ్యం కోసం అన్నమాచార్యుల ఔషద సంకీర్తనలైన ‘పొడగంటిమయ్యా’, ‘కొనరో కొనరో’, ‘సకల శాంతికరము’ అన్న సంకీర్తనలు పాడి స్వామికి వందనం తెలుపుకొని శోభారాజు గారికి నమస్కారించి వెళ్ళారు. అన్నమాచార్య భావనా వాహిని శిష్యులు జయశ్రీ, అక్షయ్, సౌజన్య తదితర శిష్యులు ఇందులో పాల్గొన్నారు. చివరలో మంగళహారతి, తీర్థ ప్రసాదాలతో కార్యక్రమం ముగిసింది.”








