‘గుడ్ బాయ్స్’ మోషన్ పోస్టర్ విడుదల
ప్రముఖ కమెడియన్, నటుడు వెన్నెల కిశోర్ పుట్టినరోజు సందర్భంగా ‘గుడ్ బాయ్స్’ మేకర్స్ .. ఈ సినిమా ఎంటర్టైనింగ్ మోషన్ పోస్టర్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేశారు. రాఘవ్ కథను అందిస్తూ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను సూర్య గుణ్ణం, వివేక్ ఇనంపూడి, నవ్య శశాంక్ కనకమేడల నిర్మిస్తున్నారు. ఫస్ట్ లుక్ చూస్తుంటే ‘గుడ్ బాయ్స్’ సినిమా ఫుల్ కామెడీ, కడుపుబ్బా నవ్వించే సన్నివేశాలు, ఊహించని అడ్వెంచర్లతో ప్రేక్షకులను మెప్పించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో వెన్నెల కిశోర్ ఓ క్రేజీ గ్యాంగ్‌ను లీడ్ చేస్తూ తనదైన కామెడీతో అలరించనున్నారు.
ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన ‘కజిన్స్ ఆర్ కమింగ్’ ప్రమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. సినిమాలోని ప్రధాన నటీనటులతో రూపొందించిన ఈ వీడియోలోని ఫన్నీ సన్నివేశాలు, విభిన్నమైన క్యారెక్టర్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు విడుదలైన మోషన్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. ఇందులో మొత్తం గ్యాంగ్‌ను స్టైలిష్‌గా, ఫుల్ గందరగోళంగా ఉన్న సెటప్‌లో పరిచయం చేశారు. ‘వీళ్లు హీరోలు కాదు.. అసలు హీరోలకు దగ్గరగా కూడా రారు. కానీ విలన్లను ఎదుర్కొనేంత పిచ్చి ఉన్నవాళ్లు మాత్రం వీళ్లే’ అనే ట్యాగ్‌లైన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఒక్క లైన్‌తోనే సినిమా ఎంత ఫన్ఫుల్గా, వెరైటీగా ఉండబోతుందో అర్థమవుతోంది.
టాలవుడ్‌లో తన కామెడీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వెన్నెల కిశోర్ మరోసారి తనదైన కామెడీ టైమింగ్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంటున్నారు. మోషన్ పోస్టర్లో ఆయన చుట్టూనే మొత్తం సందడి, గందరగోళం కనిపిస్తోంది. దీన్ని బట్టి ఆయన పాత్ర నవ్వులు పంచడంతో పాటు, అందరికీ నచ్చేలా, ఎప్పుడు ఏం చేస్తాడో ఊహించలేని విధంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. వెన్నెల కిశోర్‌తో పాటు మంచి టాలెంట్ ఉన్న నటీనటుల బృందం ఉండటంతో ‘గుడ్ బాయ్స్’ ఫుల్ ఎంటర్టైనర్గా అలరించేందుకు సిద్ధమవుతోంది. ఊహించని స్టైల్లో ఉండే కామెడీ, గందరగోళం కలగలిసి ఈ సినిమా ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందించనుంది.
ఈ సినిమాలో వెన్నెల కిశోర్, శృతి సోధి, రవి రాజా, వివా హర్ష, వామ్సీ గౌడ్, గుండు సుదర్శన్, జోషి జోష్ క్రియేషన్స్, హైపర్ ఆది, రఘుబాబు, కిరణ్ మాచా, ఢీ పండు, రమణ భార్గవ్, అశ్విని అయ్యలూరు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎనర్జిటిక్ మోషన్ పోస్టర్ ఇప్పటికే సినీ ప్రియుల్లో ఆసక్తిని పెంచింది. పోస్టర్‌లోని వెరైటీ లుక్, కలర్‌ఫుల్ ప్రజెంటేషన్, ఎంటర్టైనింగ్ కాన్సెప్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో ‘గుడ్ బాయ్స్’ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
రాఘవ్ కథను అందించి దర్శకత్వం వహిస్తోన్న ‘గుడ్ బాయ్స్’.. నవ్వులు, స్నేహం, ఫుల్ కామెడీతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించే కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు గౌతమ్ గోవిందరాజన్ సినిమాటోగ్రాఫర్‌గా, శ్రీచరణ్ పాకాల సంగీత దర్శకుడిగా, సీనియర్ ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.
సూర్య గుణ్ణం, వివేక్ ఇనంపూడి, నవ్య శశాంక్ కనకమేడల నిర్మిస్తున్న ఈ సినిమాకు అర్జున్ రాజా దాసరాజు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వెన్నెల కిశోర్‌లోని పూర్తి కామెడీ యాంగిల్‌ను, ఆయన మార్క్ ఎంటర్టైన్మెంట్ను ప్రేక్షకులకు అందించేలా ‘గుడ్ బాయ్స్’ ఫుల్ ఫన్‌తో కూడిన ఎంటర్టైనర్గా రూపొందుతోంది.








