మణి శర్మ చేతుల మీదుగా ‘చకోర – Lunar Love Bird’ మూవీ నుంచి థర్డ్ సింగిల్ ‘నా ప్రేమ దేవత..’ రిలీజ్
మాస్ పోయెట్రీతో మ్యూజికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ‘చకోర – Lunar Love Bird’ చిత్రంలోని థర్డ్ సాంగ్ ‘నా ప్రేమ దేవత’ లిరికల్ వీడియోను మెలోడీ బ్రహ్మ మణి శర్మ ఆవిష్కరించారు. High Joy Commercials బ్యానర్‌పై డా. చింతాడ హేమారావు నిర్మాతగా, VIP – Vintage Iconic Pictures నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం రూపొందింది. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దగ్గర ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన మంగా శ్రీనివాస్ ఈ చిత్రంతో నూతన దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రవణ్, మలైకా టి. వాసుపల్ ను సరికొత్త ప్రేమ జంటగా పరిచయం చేస్తూ ఈ సినిమా తెరకెక్కింది. ‘చకోర – Lunar Love Bird’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 9న థియేటర్లలో విడుదల కానుంది.
ఆణిముత్యాల్లాంటి పాటలతో రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రిన్స్ హెన్రీ సంగీతం అందిస్తున్నారు. రామజోగయ్య శాస్త్రి ఈ సాంగ్ కు సాహిత్యం అందించారు. డాన్స్ మాస్టర్ రాజు (SDC) కొరియోగ్రఫీ చేశారు. ప్రముఖ గాయకుడు శ్రీకృష్ణ ఈ మెలోడీ సాంగ్ ని పాడారు. మణిశర్మ గారి దగ్గర ఎక్కువ కాలం టెక్నీషియన్ గా పని చేసిన అనుభవంతో మ్యూజిక్ డైరెక్టర్ ప్రిన్స్ హెన్రీ ఆయన మెలోడీస్ నుంచి ఇన్స్పైర్ అయ్యి చేసిన ఈ మెలోడీ సాంగ్ యువతని ఊర్రూతలూగించేలా రూపొందించారు. ఈ సందర్భంగా మెలోడీ బ్రహ్మ – ప్రముఖ సంగీత దర్శకులు మణిశర్మ చకోర మూవీ టీమ్ ని ప్రశంసించి తన ఆశీస్సులు అందజేశారు .
‘నా ప్రేమ దేవత..’ పాట ఎలా ఉందో చూస్తే – నా ప్రేమ దేవతల్లే నిన్నే చూస్తున్నా, గుండెల్లో కోవెల కట్టి ఆరాధిస్తున్నా, అచ్చంగా ఆకాశం నినుపంపిందే, అందాల చెలి జాబిలి, నా పూల మధుమాసం నీతోనే ముడిపడి ఉందే..అంటూ ఆకట్టుకునేలా సాగుతుందీ పాట.








