పేదలకు పట్టాభిషేకం.. ఆస్తి హక్కు పత్రాలను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
* విశాఖ
* పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
* 28,445 కుటుంబాలకు ఇళ్ల స్థలాలపై హక్కు కల్పించి కొందరు లబ్దిదారులకు పట్టాలు అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.
* పేదలకు పట్టాభిషేకం బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..
* ఇళ్ల పట్టాలను అందుకుంటున్న కుటుంబాల్లో సంతోషం నెలకొంది.
* పేదలకు పట్టాభిషేకం చేస్తున్నాం.. వారి ఇళ్లపై సర్వ హక్కులు కల్పిస్తున్నాం.
* ఇళ్ల పట్టాలు పొందిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను
* కూడు, గూడు, గుడ్డ ఇదీ మా ప్రభుత్వ నినాదం..ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు ఉండాలనే ఎన్టీఆర్ స్పూర్తితో పని చేస్తున్నాం.
* మీ ఇళ్లపై మీకు హక్కు లేదనే బాధ ఇన్నాళ్లూ ఉంది. దశాబ్దాల ఆందోళనకు ఇవాళ ముగింపు పలుకుతున్నాం.
* ఇక నుంచి మీ ఇళ్లపై వివాదం లేదు… భయం లేదు.. హక్కు మాత్రమే ఉంటుంది.
* కన్వెయన్స్ డీడ్స్ ఇస్తున్నాం.. రిజిస్ట్రేషన్ ధర ప్రకారం ఈ భూమి విలువ రూ. 8874 కోట్లు ఉంటుంది.
* మార్కెట్ ధర ఇంకా ఎక్కువే ఉంటుంది.
* మార్కెట్ ధర ఎక్కువగా ఉందని విలువైన మీ భూములను అమ్ముకోవద్దు… ఈ భూమే మీకు భరోసా.. ధైర్యం.
* మీ భూమి-మీ హక్కు కార్యక్రమంలో రెవెన్యూ సమస్యల నుంచి విముక్తి కల్పిస్తున్నాం.
* గత ప్రభుత్వం ప్రజల ఆస్తి మీద వాళ్ల బొమ్మలు వేసుకునేది..కానీ మేం రాజముద్రతో పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇస్తున్నాం.
* ఇప్పటికే వివిధ జిల్లాల్లో మొత్తంగా 12 వేల కుటుంబాలకు భూములు క్రమబద్దీకరణ చేసి పట్టాలు ఇచ్చాం.
* ఈ ప్రాంతంలో పంచ గ్రామాల సమస్య ఉంది.. మొత్తంగా 22 వేల మందికి పట్టాల్సివ్వాల్సి ఉంది
* వీళ్లందరికీ త్వరలోనే పట్టాలిచ్చేలా చర్యలు తీసుకుంటాం.
* దేవాదాయ శాఖకు చెందిన భూముల్లో కొందరు పేదలు నివసిస్తున్నారు.
* ప్రతి ఒక్కరికీ ఇంటి జాగా ఉండాలి… ఆత్మగౌరవం ఉండాలి.
* రెండేళ్లల్లో 5 లక్షలకు పైగా ఇళ్లు కట్టాం..వచ్చే మార్చిలోగా మరో 5 లక్షలకు పైగా ఇళ్లను ఇస్తాం.
* ఇంటి జాగా ఇస్తాం… ఇల్లు కట్టిస్తాం.. శాశ్వత చిరునామా ఉండేలా చేస్తాం.
* సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ఇదే మా విధానం.
* ప్రతి వర్గాన్ని ఆదుకుంటున్నాం.. ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాం.
* విశాఖపట్నం వాసులకు నాపై ఎనలేని అభిమానం ఉంది.
* హుద్ హుద్ తుపాను సమయంలో అండగా నిలిచిన విశాఖ వాసులను ఎన్నటికీ మరువను.








