విశాఖ ఆర్కే బీచ్‌లో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
విశాఖపట్నం
• ఆర్కే బీచ్‌లో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
• సాగర స్వచ్ఛత కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన సీఎం చంద్రబాబు.
• పెదజాలరిపేటలో ఓషన్ ప్లాస్టిక్ రికవరీ సెంటర్ పైలట్ సైట్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు.
• సముద్ర వ్యర్ధాలను సేకరించే పారిశుద్ధ్య కార్మికులు, మత్స్యకారులు, స్కూబా డైవర్లతో సీఎం ముఖాముఖి.
• చేపల వేటతో పాటు సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరణతో లభించే ప్రొత్సాహంతో తమకు అదనపు ఆదాయం వస్తోందని ముఖ్యమంత్రికి తెలిపిన మత్స్యకారులు.
• సముద్ర ఉపరితలంలో సేకరించిన వ్యర్థాలను డిజిటల్ తూకం వేసే విధానాన్ని పరశీలించిన సీఎం చంద్రబాబు.
• సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ ద్వారా లభించే ప్రొత్సాహకాన్ని మత్స్యకారులకు అందించిన ముఖ్యమంత్రి.
• సముద్ర గర్భంలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, పాత వలలు తొలగిస్తున్న విధానాన్ని స్కూబా డైవర్లను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి.
• సాగర స్వచ్ఛతలో భాగంగా ఏకంగా 1,200 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎంకు వివరించిన అధికారులు.
• మ్యాన్‌హోళ్లు, మురుగు కాల్వల శుభ్రత కోసం జీవీఎంసీ అందుబాటులోకి తెచ్చిన ఆధునిక సీవరేజ్ రోబో పనితీరును ప్రదర్శనశాలలో పరిశీలించిన సీఎం.
• జీవీఎంసీ సాగర స్వచ్ఛత ప్రాజెక్టుకు లభించిన గ్లోబల్ గుర్తింపు, భవిష్యత్తు లక్ష్యాలపై బ్లూమ్‌బెర్గ్ ప్రతినిధులతో చర్చించిన ముఖ్యమంత్రి.
• సాగర తీరంలో మురి మిక్చర్ విక్రయించే మహిళ జీవనోపాధి గురించి అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు.
• ఆమె విక్రయించే మురిమిక్చర్‌ను ఆస్వాదించిన చంద్రబాబు.
• మురి మిక్చర్ విక్రయించే మహిళ ఒంటరి మహిళ అని తెలుసుకున్న సీఎం, ఆమెకు పెన్షన్ మంజూరు చేయాలని అధికారులకు ఆదేశం.








