అనీష్ పై వెంకీకు అంత నమ్మకమేంటి?
తెలుగు సినిమా ప్రేమకథల్లో కొత్తదనాన్ని కోరుకునే ఆడియన్స్ కు ఇట్లు అర్జున(Itlu arjuna) ఇంట్రెస్టింగ్ ఆప్షన్‌గా కనిపిస్తోంది. అనీష్(Aniesh), అనస్వర రాజన్(anaswara rajan) జంటగా నటిస్తున్న ఈ సినిమాతో డైరెక్టర్ వెంకీ కుడుముల(Venky kudumula) మొదటిసారి నిర్మాతగా మారారు. మహేష్ ఉప్పల(mahesh uppala) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఎస్. తమన్(S thaman) సంగీతం అందించారు. ఇప్పటికే సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, తాజాగా రిలీజైన టీజర్‌కు కూడా భారీ రెస్పాన్స్ వస్తోంది. రిలీజైన కొద్దిసేపటికే 5 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించడం సినిమాపై ఉన్న ఆసక్తిని స్పష్టం చేస్తోంది. అక్టోబర్ 30న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.
ముఖ్యంగా హీరో క్యారెక్టర్ ను మ్యూట్ క్యారెక్టర్‌గా చూపించడం ఇట్లు అర్జున కు స్పెషల్ ఎట్రాక్షన్ గా మారింది. రెగ్యులర్ లవ్ స్టోరీకి భిన్నమైన కాన్సెప్ట్ తో ఈ సినిమాను మంచి ఎంటర్టైన్మెంట్ ను జోడించి డైరెక్టర్ తెరకెక్కించినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. డెబ్యూ హీరోగా ఇలాంటి క్యారెక్టర్ ను ఎంచుకోవడంపై అనీష్‌కు ప్రశంసలు వస్తున్నాయి. సినిమాలోని యాక్షన్ సీన్స్ థ్రిల్లింగ్‌గా డిజైన్ చేశారని, వాటిలో యాక్ట్ చేయడం తనకు ఎంతో నచ్చిందని అనీష్ చెబుతున్నాడు. ఇక అనస్వర రాజన్ క్యారెక్టర్ కూడా రిలీజ్ తర్వాత ఆడియన్స్ లో స్పెషల్ గా నిలుస్తుందని, ఆమెను మరోసారి కీర్తిగా గుర్తుపెట్టుకునే స్థాయిలో రెస్పాన్స్ వస్తుందని అనీష్ ధీమా వ్యక్తం చేశాడు.
నిర్మాతగా తన ఫస్ట్ ఎక్స్‌పీరియెన్స్ గురించి వెంకీ కుడుముల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నిర్మాతలు ఎదుర్కొనే ఇబ్బందులు స్వయంగా తెలుసుకున్న తర్వాత వారిపై తన గౌరవం మరింత పెరిగిందన్నారు. అనీష్లోని కన్విక్షన్ నచ్చడంతో అతడిపై నమ్మకంతో ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చినట్లు చెప్పారు. ఛలో(Chalo) టైమ్ లో రష్మిక(Rashmika) విషయంలో కలిగిన ఫీలింగ్‌నే అనీష్ విషయంలోనూ ఎక్స్‌పీరియెన్స్ చేశానని, అతడు స్టార్‌గా ఎదుగుతాడనే నమ్మకం ఉందన్నారు. డైరెక్షర్ మహేష్ ఉప్పల తన సిట్యుయేషన్స్ ను ఎదుర్కొంటూనే ఈ కథను రెడీ చేశారని, తమన్ మ్యూజిక్ లవ్ స్టోరీకి ప్రాణం పోసిందని వెంకీ పేర్కొన్నారు. ఇట్లు అర్జున థియేటర్లలో ఆడియన్స్ ను అలరిస్తూనే ఎమోషన్ కు గురిచేసే సినిమా అవుతుందని చిత్రబృందం నమ్మకంగా ఉంది.








